రూ.32 లక్షలు ఖర్చు పెట్టి అన్‌సీల్డ్ ఐఫోన్ కొన్నాడు… తీరా తెరిచి చూసి షాక్ తిన్నాడు!

మనలో కొంతమంది పాతకాలపు ఉత్పత్తులను సొంతం చేసుకోవడానికి, వాటిని వాడడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ వుంటారు.

ఐఫోన్( IPhone ) అనేది చాలా మందికి ఫేవరేట్ మొబైల్ ఫోన్.చాలా ఏండ్ల కిందటి అనేక సీల్డ్ ఐఫోన్‌లు ఈమధ్య కాలంలో వేలం వేశారనే వార్తలు మీరు వినే వుంటారు.

ఒకటి ఫిబ్రవరిలో వేలం వేయగా రికార్డు స్థాయిలో 63,000 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.

51 లక్షలుకి అమ్ముడు పోయి ఆహూతులకు షాక్ ఇచ్చింది.మరొక గాడ్జెట్ 'లక్కీ యు'( Lucky You ) స్టిక్కర్‌తో 40,320 డాలర్లకు అంటే సుమారు రూ.

32 లక్షలుకి విక్రయించబడింది. """/" / ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే, టెక్ యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ అరుదైన 'ఫ్యాక్టరీ సీల్డ్'( Factory Sealed ) ఒరిజినల్ ఐఫోన్‌ను గెలుచుకున్న బిడ్డర్ అని ఒక ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.

"సీల్డ్ ఒరిజినల్ ఐఫోన్‌ను అన్‌బాక్స్ చేయడానికి నేను $40,000 వెచ్చించాను" అని వీడియోలో రివీల్ చేశాడు.

మనుషులు ఎవరూ ఎన్నడూ తాకని, ఎన్నడూ ఓపెన్ చేయనటువంటి ఐఫోన్‌ దొరకడం అనేది చాలా అరుదు.

ఫ్యాక్టరీ అవులెట్స్, ఒరిజినల్ ఐఫోన్లు పొందాలనుకునేవారు మోసగించబడుతూనే ఉన్నారు అని మార్క్వెస్ బ్రౌన్లీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

"""/" / కాగా ఇటువంటి వేలం జరిగినపుడు కొంతమంది ఉపయోగించిన ఫోన్లను బాక్సులో సీల్ చేసి విక్రయిస్తూ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.

మార్క్వెస్ బ్రౌన్లీ( Marquess Brownlee ) తాను ఐఫోన్ వేలంపాటలో ఇలా పాల్గొన్నాడు.

దానికోసం మొదట Ebay!--com వెబ్ సైట్‌లో లాగిన్ అయ్యాడు.ఆ తరువాత ప్రారంభ ఆఫర్‌ ద్వారా కనిష్ట 32వేల డాలర్లు (రూ.

26 లక్షలు) కోట్ చేశానని తెలిపాడు.సేల్స్ ట్యాక్స్, బిడ్డింగ్ ప్రీమియం, షిప్పింగ్ ఫీజు మొత్తం ఖర్చు 40 వేల డాలర్లు (సుమారు రూ.

32 లక్షలు)కు చేరుకుందని యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీ చెప్పుకొచ్చారు.

బెనిఫిట్ షోల పేరుతో దోపిడీ.. దేవర మూవీ విషయంలో తప్పు అక్కడే జరుగుతోందా?