రూ.12 లక్షలు ఖర్చు పెట్టి కుక్కలా మారాడు.. ఇప్పుడేం అయిందంటే

ఎప్పుడైనా 'కుక్క' కావాలని కలలు కన్నారా? ఈ ప్రశ్న మీకు వింతగా మరియు అర్ధంలేనిదిగా అనిపించవచ్చు.

అయితే జపాన్‌లోని ఓ వ్యక్తికి కుక్కలా కనిపించాలనే మనస్ఫూర్తిగా కోరిక కలిగింది, దానిని కూడా నెరవేర్చుకున్నాడు.

ప్రస్తుతం ఈ వ్యక్తి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో మే నెలలో వైరల్‌గా మారాయి.

ఒక మనిషి 'కుక్క'గా ఎందుకు ఉండాలనుకుంటున్నాడో అని ప్రజలు అప్పటి నుంచి కలవరపడుతున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.దాదాపు రూ.

12 లక్షలు వెచ్చించి ఆ వ్యక్తి తనను తాను కోలీ జాతి కుక్కగా మార్చుకున్నాడు.

అయితే, అతను ఈ చర్య ఎందుకు తీసుకున్నాడో అని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వస్తున్నాయి.

ట్విట్టర్ యూజర్ @toco_eevee కుక్క దుస్తులలో ఉన్న వ్యక్తి చిత్రాలను గతంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు.

'జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీ ఈ దుస్తులను 40 రోజుల్లో డిజైన్ చేసింది, దీని ధర 20 లక్షల యెన్‌లు (భారత కరెన్సీలో దాదాపు 12 లక్షల రూపాయలు).

ఇది తన చిన్ననాటి కల అని కుక్కలా మారిన జపాన్ వ్యక్తి టోకో పేర్కొన్నాడు.

"""/"/దీంతో బాగా డబ్బు వెచ్చించి తాను తన కల నెరవేర్చుకున్నట్లు వెల్లడించారు.

అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం టోకోను ఆవేదన వెంటాడుతోంది.చిన్నప్పటి నుంచి తనకు కుక్కలా జీవించాలనే కల ఉండేదని, వాటి జీవన విధానం తనకు నచ్చిందని తెలిపాడు.

అయితే తాను కుక్కగా మారిన తర్వాత తన జీవితం పట్ల తనకు భయం కలుగుతోందని వెల్లడించాడు.

తాను కుక్కగా మారడం వల్ల తన కుటుంబ సభ్యులు తనకు దూరం అవుతారని ఆందోళన చెందుతున్నట్లు చెప్పాడు.

అది తనను బాదిస్తోందని వెల్లడించారు.త్వరలోనే తాను మునుపటిలా మారనున్నట్లు పేర్కొన్నాడు.

కేవలం తన సరదా తీర్చుకున్నానని, చివరికి ఈ చర్య తనలో భయం రేకెత్తిస్తోందని వాపోయాడు.

సెంట్రల్ ఎన్ఆర్ఐ సెల్‌కు 2022లో ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసా?