కస్టమర్లకు ప్లేట్‌లో గాలి బుడగలు వడ్డించాడు.. ఏ రెస్టారెంట్‌లో తెలుసా?
TeluguStop.com
చాలా హై-ఎండ్ రెస్టారెంట్‌లు, హోటళ్లలో ఫుడ్ తినాలంటే చాలా ఖర్చు పెట్టాలి.అక్కడ సర్వ్ చేసే విధానం చాలా మర్యాదగా ఉంటుంది.
ప్రపంచంలోని ఖరీదైన డిష్‌లను అక్కడ వడ్డిస్తారు.ఇదే అభిప్రాయం మనకు ఉంటుంది.
అయితే ఓ ఫేమస్ రెస్టారెంట్( Restaurant )లో ప్లేట్లలో ఏ ఆహారం వడ్డించారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఓ సీనియర్ చెఫ్ వచ్చి కస్టమర్ ప్లేట్‌లో గాలి బుడగలు వడ్డించాడు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి. """/" /
ఫ్యాన్సీ డిష్( Fancy Dish ) ఒకటి స్పెయిన్‌లోని ఓ రెస్టారెంట్‌లో వడ్డిస్తున్నారు.
ఇది గాలిలో తేలాయాడే డిజర్ట్.ఈ తీపి వంటకం అక్షరాలా గాలిలో తేలుతుంది.
ఈ ప్రత్యేకమైన డిజర్ట్‌తో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డెజర్ట్‌లోని కొంత భాగాన్ని సర్వర్ కత్తిరించడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు.
వీడియోను LADbibleAustralia అనే ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.ఆ గాలి బుడగలను హీలియంతో చేసినట్లు స్పష్టం అవుతోంది.
అందు వల్లే ఆ బుడగలు పేలకుండా ఉన్నాయి.ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఈ వీడియో 20 మిలియన్ల వ్యూస్‌ను దాటింది.
ఈ క్లిప్‌కి సోషల్ మీడియాలో 8.8 వేల లైక్‌లు, 1300ల కంటే ఎక్కువ కామెంట్‌లు వచ్చాయి.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.అంత పెద్ద రెస్టారెంట్ లో గాలి బుడగలు వడ్డించడం విడ్డూరంగా ఉందని, దాని కోసం కస్టమర్ల అధిక మొత్తం చెల్లిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
అతిగా యాడ్స్ వేయడంతో పీవీఆర్ – ఐనాక్స్కి షాక్ ఇచ్చిన వినియోగదారుడు!