వీడు మహా ముదురు… ఈ బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా..

ఇప్పటి పిల్లలు చిన్న వయస్సులోనే ఫోన్‌కు బానిసై పోతున్నారు.ఫోన్‌లో వివిధ రకాల వీడియోలు, ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకుంటూ సమయం గడుపుతున్నారు.

చిన్న వయస్సులోనే ఫోన్ కు బానిసగా మారడం వల్ల చదువుపై దృష్టి పెట్టకపోవడంతో పాటు చెడుదారి పడుతున్నారు.

అలాగే ఫోన్ వాడటం వల్ల రేడియేషన్ ప్రభావానికి గురై అనేక సమస్యలను చిన్న వయస్సులోనే ఎదుర్కొంటున్నారు.

అయితే పిల్లలు ఎక్కువగా ఫోన్లు వాడేటప్పుడు తల్లిదండ్రులు చూసి మందలిస్తూ ఉంటారు.దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా దొంగచాటున పిల్లలు ఫోన్లు వాడుతూ ఉంటారు.

"""/" / అయితే ఒక పిల్లవాడిని రూమ్ లో ఉంచిన తల్లి చేతికి బుక్ ఇచ్చి బయట పనిచేసుకుంటూ ఉంది.

కానీ తల్లి బయటకు వెళ్లగానే బుడ్డోడు స్మార్ట్ ఫోన్( Smart Phone ) తీసుకుని ఆడుకుంటున్నాడు.

ఒకవేళ తల్లి వెంటనే వచ్చి చూసినా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండకుండా ఒక ఐడియా ఆలోచించాడు.

తలుపుకి ఒక తాడు కట్టాడు.ఆ తాడుని గోడకు కట్టి దానికి అడ్డంగా షర్ట్ తగిలించాడు.

ఈ మధ్యలో ఫోన్ ను వేలాడదీసి దానిని తలుపు తీయగానే పైకి వెళ్లిపోయేలా ఏర్పాటు చేశాడు.

దీంతో ఒకవేళ తల్లి వచ్చి సడెన్ గా తలుపు తీసినా ఫోన్ పైకి వెళుతుంది.

"""/" / ఈ వీడియోలో తల్లి వచ్చి చూడగానే ఫోన్ ఆటోమేటిక్ గా పైకి వెళుతుంది.

తలుపు తోసి చూడగానే ఫోన్ పోవడం, పిల్లాడు పుస్తకం వైపు చూడటం ఈ వీడియోలో కనిపిస్తుంది.

ది ఫీజెన్( The Feigen ) అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోకు రెండు మిలియన్లకుపైగా వ్యూస్, 45 వేల లైక్స్ వచ్చాయి.అలాగే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

స్మార్ట్ బాయ్ అని కొంతమంది కామెంట్స్ పెడుతుండగా.బాగా టాలెంటెడ్ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆరోగ్యమైన తిండి పెట్టండి అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవి అందుకోబోతున్నారా?