ఆ హీరో వల్లే ప్రకాష్ రాజ్ కి అవకాశాలు రావడం లేదట
TeluguStop.com
సౌత్ ఇండియా బెస్ట్ నటుల్లో ఒకడు ప్రకాష్ రాజ్.తన నటనతో మాటలతో జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఆయన.
విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన మంచి గుర్తింపు పొందాడ.ఈయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు.
తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా అందుకున్నాడు.ఈయన ఎంత మంచి నటుడో అంతకు మించి వివాదాస్పద వ్యక్తి.
తన వ్యాఖ్యలతో పటు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు.సినిమాల పరంగా ఆయన నటనకు ఏ వంక పెట్టలేం.
ఏ పాత్రనైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటుడు.తెలుగులో ఒకప్పటి అగ్ర నటులైన ఎస్వీఆర్, సత్యనారాయణ, రావుగోపాల రావు, కోటా శ్రీనివాసరావు లాంటి పేరు ప్రఖ్యాతులు పొందాడు.
చూడాలని ఉంది, సుస్వాగతం సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందాడు.ఈ సినిమాల్లో తన అద్భుత నటనతో ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు.
అంతేకాదు.తను నటించి ఒక్కడు, స్టాలిన్ సినిమాల్లో పాత్రలకు ఓరేంజిలో గుర్తింపు వచ్చింది.
ఆ సమయంలో టాలీవుడ్ లో ఆయనకు మస్త్ పాపులారిటీ వచ్చింది.పలువురు సినిమా దర్శక,నిర్మాతలు ఆయన డేట్ల కోసం వేచి చూసే పరిస్థితి ఏర్పడింది.
ఆ తర్వాత నెమ్మదిగా ఆయనకు అవకాశాలు తగ్గాయి.అందుకు కారణం ఓ తమిళ హీరోనట.
ఇంతకీ ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. """/"/
ఆయన మరెవరో కాదు.
తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ప్రస్తుతం ఈయన హీరో కంటే విలన్ గా బాగా నటించి మెప్పిస్తున్నాడు.
ఉప్పెన సినిమాతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ నూ బాగా ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమాలు ఎక్కువగా చేసేందుకు రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం సౌత్ లో విజయ్ సేతుపతికి మంచి డిమాండ్ ఏర్పడింది.దీంతో ప్రకాశ్ రాజ్ కు అవకాశాలు తగ్గాయి.
కొత్త నటుడు అయిన విజయ్ సేతుపతి ముందు పాత నటుడు అయిన ప్రకాష్ రాజ్ వెనుకబడినట్లు తెలుస్తోంది.
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి… అందరూ షాక్!