T20 ప్రపంచ కప్ లో పరుగుల వరద పారించేది అతడే… వీరు భాయ్ జోస్యం..

ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా టి20 ప్రపంచ కప్ మీద దృష్టి పెట్టారు.ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో పాల్గొనడానికి ఆస్ట్రేలియాలో కసిగా సాధన చేస్తూ ఉంది.

ఇంకా చెప్పాలంటే టి20 ప్రపంచ కప్ జరుగుతున్న ఆస్ట్రేలియాలో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు కూడా అక్కడి పిచ్ లు అంకులంగా ఉంటాయి.

ఆస్ట్రేలియాలోని బ్యాటింగ్ పిచ్ లపై పరుగుల వరద పారడం ఖాయమని ఇప్పటికే కొంతమంది మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు.

టి20 ప్రపంచ కప్ లో ఎక్కువగా బ్యాటర్లే రెచ్చిపోయే అవకాశం ఉంది.ఇలాంటి సమయంలో ఈ మెగా టోర్నీలో పరుగుల వరద పారించే బ్యాటరీ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

మరి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్ అతడే అని మన టీమ్ ఇండియా, ఢిల్లీ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్ హెచ్చరిస్తున్నాడు.

"""/"/ ప్రపంచకప్ లో సూపర్-12 ప్రారంభానికి ముందు వీరూ మాట్లాడుతూ ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో ఉంటాడని చెప్పాడు.

విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అదే ఫీలింగ్ బాబర్ బ్యాటింగ్ చూసినప్పుడు వస్తుంది అని చెప్పాడు.

వీరూ తో పాటు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసేది బాబర్ అని చెప్పడం విశేషం.

కానీ మీ ఇద్దరు చెబుతున్నా బ్యాటర్ ప్రస్తుతం ఫామ్ లో లేడు.కొంతమందికి అభిమానులు ఇలా జరగడం చాలా కష్టమని కూడా చెబుతున్నారు.

ఎందుకంటే బాబర్ ఆజం ఆసియా కప్ లో కూడా వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు.

ఇంకా చెప్పాలంటే ఈ టి 20 ప్రపంచకప్ లో భారత్ తో పాటు ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరుతాయని వీరేంద్ర సెహ్వాగ్ జోష్యం చెప్పాడు.

వైరల్ వీడియో: భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన రోహిత్.. ఫైనల్లో టీమిండియా..