సునీత పోస్టర్ల కలకలం : ఆ పార్టీ పనేనా?

తన తండ్రి హత్య కేసు లోనేరస్థులు ఎవరో తేల్చడానికి అలుపెరగని పోరాటం చేసిన వివేకానంద రెడ్డి ( Vivekananda Reddy )కుమార్తె సునీత( Sunitha ) పోరాటం ఆఖరి దశకు వచ్చింది .

హంతకులు ఎవరు అన్న విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన సిపిఐ దానిని టెక్నికల్గా నిరూపించే ప్రయత్నంలో ఉంది .

అయితే నేరస్తులు ఎవరో నిరూపించడానికి సునీత చేసిన పోరాటం మాత్రం అసమాన్యం అనే చెప్పాలి దాదాపు ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న కేసులో న్యాయం జరగడం అనేది చాలా కష్టమనే చెప్పాలి.

అలాంటిది పట్టు వదలకుండా ఇంతవరకు ఆమె కేసును ముందుకు కదిలించిన తీరు చాలామందికి ఆదర్శం అనే చెప్పాలి.

వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా అనేక ఆరోపణలు కూడా ఈ కేసులో రావటం శోచనీయం.

"""/" / సునీత మరియు ఆమె భర్త ఈ హత్య చేశారని కూడా ప్రత్యర్థులు ఆరోపించారు అయినప్పటికీ వాటన్నిటిని దాటుకొని దాదాపు నేరస్థులు ఎవరో తేలిన ఈ కేసు చివరి అంకానికి చేరుకుంది .

ఇప్పుడు సునీత పై మరో రకంగా దాడి జరుగుతుంది .ఆమె తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party )లో చేరుతుందని ,తెలుగుదేశం పెద్దలు ప్రణాళికా ప్రకారం ఆడుతుందని , రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసును నడుపుతుంది అంటూ అర్థం వచ్చేలా ఆమె పోస్టర్లను తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం అంటూ రాసిన కొన్ని బ్యానర్లను కడప జిల్లా తాడిపత్రిలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అంటించారు… ఈ బ్యానర్ల వెనుక ఉన్నది అవినాష్ రెడ్డి ( Avinash Reddy )వర్గమేనని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు .

ఇప్పటివరకు ఆ దిశగా విమర్శలు చేసి ఉన్నందున ఇది కూడా ఆయన అనుచర వర్గం పనేనని కొంతమంది అనుమానిస్తున్నారు """/" / వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు.

ఇప్పుడు చివరి దశలో ఉన్న ఈ కేసు లో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని ఈ కేసుతో సంబంధం ఉన్న అందర్నీ సిపిఐ ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉన్నందున చివరి ముద్దాయి అయిన అవినాష్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు విచారణ పూర్తవుతుందని వార్తలు వస్తున్నాయి , డబ్బు బలం ఉందనో అధికార బలం ఉందనో నేరాలు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదని ఈ కేసు నిరూపించిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు .

కాఫీ పౌడర్ తో హెయిర్ ఫాల్ ఖతం.. ఎలా వాడాలంటే..?