ఇదేందయ్యా ఇది.. రన్నింగ్ ఆటోలోనే దాన్ని రిపేర్ చేసేస్తున్నాడుగా

ప్రతినిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉంటాము.

ముఖ్యంగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుండగా.కొన్ని కొన్ని సార్లు జంతువులకు సంబంధించి, కొన్నిసార్లు అబ్బురపరిచే వీడియోలు వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాము.

ఈ నేపథ్యంలో ఓ అబ్బురపరిచే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

"""/" / ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.ఆటో రన్నింగ్ లో ఉన్న సమయంలో ఓ మెకానిక్ ఆటో టైరును( Auto Tire Mechanic ) చాలా సులువుగా మార్చేసి బిగిస్తున్నాడు.

ఆటో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక టైరును పైకి లేవి కేవలం రెండు టైర్లతోనే ఓ వ్యక్తి ఆటోను నడుపుతూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుండగా.

వెనకాల కూర్చున్న మెకానిక్ మాత్రం తన నైపుణ్యంతో పైకి లేచిన టైరును చాలా సులువుగా మార్చేస్తున్నాడు.

"""/" / ఈ ఘటన సమయంలో వారి స్నేహితులు వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా( Social Media ) వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్, అలాగే టైరు మార్చిన మెకానికులను చాలామంది అభినందిస్తుండగా.

ఇలాంటి డేంజర్ పనులు చేయడం అవసరమా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలోచన ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేసి మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ చేయండి.

సాయం చేయడానికి ఎవరూ లేరు… ఆ కారణంతోనే బతికున్నా… స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!