వావ్, దాదాపు 60 ఏళ్ల వయసున్నా.. యువకుడి లాగా కనిపిస్తున్నాడే..??

వయసు పెరుగుతున్న కొద్దీ మన చర్మం ముడతలు పడి, సన్న గీతలు ఏర్పడి, మచ్చలు వస్తాయి.

ఇది సహజమైన ప్రక్రియ.కానీ చాలామంది తమ చర్మం యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు.

ఈ కోరికే కాస్మెటిక్స్ పరిశ్రమకు కోట్లు తెచ్చిపెడుతుంది.అయితే కొంతమంది కాస్మెటిక్స్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండానే వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపిస్తుంటారు.

సింగపూర్‌కు చెందిన ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ కూడా చాలా బ్యూటిఫుల్ మైంటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

అతని పేరు చువాండో తాన్( Chuando Tan ) తన వయసు కంటే చాలా చిన్నవాడిలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు.

అతనికి ఇప్పుడు 58 ఏళ్లు. """/" / 1980లలో తాన్ మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టాడు.

1990లలో ఫొటోగ్రఫీ వైపు మళ్లే ముందు కొంతకాలం పాప్ సింగర్‌( Pop Singer )గా కూడా ఉన్నాడు.

చువాండో ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో నిష్ణాతుడు.తనకంటూ ఒక స్టూడియో కూడా ఉంది.

ప్రముఖ నటీనటులు, గాయకుల ఫోటోలు తీశాడు.ఫిలిం ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

2017, జులైలో ఒక చైనీస్ వెబ్‌సైట్ తాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంటును ప్రచారం చేయడంతో అతనికి చాలా మంది ఫాలోవర్లు పెరిగారు.

దీంతో బ్రిటిష్ మీడియా కూడా చువాండో గురించి రాసింది.చువాండో చాలా చిన్నవాడిలా కనిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

కొందరు అది అతని జన్యువుల వల్ల అని చెప్తే, మరికొందరు సింగపూర్‌లోని మంచి గాలి, అద్భుతమైన ఆరోగ్య సేవలు, అధిక ధర వస్తువులు సులభంగా దొరకడం వల్ల అని చెప్పారు.

చువాండో తన రోజువారీ జీవన విధానాన్ని గురించి కూడా చెప్పాడు.మనం తినే ఆహారం మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని 70 శాతం ప్రభావితం చేస్తుందని అతను నమ్ముతాడు.

మిగిలిన 30 శాతం వ్యాయామం ద్వారా వస్తుందని అంటాడు./br> """/" / అతను బ్రేక్‌ఫాస్ట్‌గా గట్టిగా ఉడికించిన గుడ్లు( EGGS ) తింటాడు.

కానీ వాటిలో రెండు పచ్చ సొనలు తీసేస్తాడు.తన శరీరంలో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయడానికి ఇలా చేస్తాడు.

అప్పుడప్పుడు బెర్రీలు, అవకాడో తింటాడు.మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో చికెన్, రైస్, గ్రిల్డ్ కూరగాయలు, చేపల సూప్ తింటాడు.

అప్పుడప్పుడు ఐస్‌క్రీం తింటూ ఎంజాయ్ చేస్తాడు .నీళ్లు ఎక్కువగా తాగుతాడు.

టీ, కాఫీ తాగడు.ప్రోటీన్స్, విటమిన్ సి అధికంగా ఉందా ఆహారాలు కూడా తింటాడు.

ఫిట్నెస్ కోసం స్విమ్మింగ్, ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తాడు.

న్యూయార్క్‌లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎన్ఆర్ఐలపై మేయర్ ప్రశంసలు