100 ఏళ్లు దాటినా వైద్యునిగా సేవలు అందిస్తున్నాడు.. వరించిన గిన్నిస్ రికార్డు..

సాధారణంగా అన్ని రంగాల్లో ఉద్యోగులు నిర్దిష్ట వయసు వచ్చాక పదవీ విరమణ పొందుతారు.

కానీ డాక్టర్లు మాత్రం తమకు శక్తి ఉన్నంతవరకు వైద్యం అందిస్తూనే ఉంటారు.వయసులో ఉన్నంత హుషారుగా ఉండలేరు కాబట్టి వారు అసిస్టెంట్లపై ఆధారపడుతూ రోగులకు చికిత్సను అందిస్తారు.

అయితే ఒక డాక్టర్ వందేళ్లు దాటినా సేవలను కంటిన్యూగా అందిస్తూనే అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.

అమెరికాలోని ఓహియోకు చెందిన న్యూరాలజిస్ట్‌ హోవర్డ్‌ టక్కర్‌ ప్రజల జబ్బులు నయం చేయాలనే తపనతో తన వందేళ్ల వయసులో కూడా రోజూ ఆసుపత్రికి వస్తూ పనిచేస్తున్నారు.

2021, ఫిబ్రవరిలో ఓల్డెస్ట్‌ ప్రాక్టీసింగ్‌ డాక్టర్‌గా అతను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును తన పేరున లిఖించుకున్నారు.

అప్పటికే అతని వయసు 98 ఏళ్ల 231 రోజులు.2021 మార్చినాటికి అతనికి 99 ఏళ్లు నిండాయి.

2022 మార్చి నాటికి నూరేళ్లు నిండాయి.అయినా కూడా అతను రెస్ట్ అనేది తీసుకోవడం లేదు.

ఇప్పటికీ డైలీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేస్తున్నారు.

"""/"/ హోవర్డ్‌ టక్కర్‌ 100వ బర్త్‌డే పురస్కరించుకున్న తర్వాత జులైలో కరోనా కోరల్లో చిక్కుకున్నారు.

ఆ సమయంలోనూ అతను వైద్య సలహాలు ఇచ్చారు.అంటే అతను తన వృత్తి పట్ల ఎంత అంకిత భావం చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

1922, జులై 10న పుట్టిన టక్కర్‌.సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు యూఎస్‌ నేవీలో సైన్యానికి వైద్య సేవలందించారు.

అలానే 1950 కొరియాతో యుద్ధం వచ్చినప్పుడు అట్లాంటిక్‌ ఫ్లీట్‌లో న్యూరాలజీ చీఫ్‌గా వర్క్ చేశారు.

రెస్ట్ తీసుకోవడం వల్ల ఆయుష్షు తగ్గుతుందని ఇతను అంటున్నారు.హోవర్డ్‌ భార్య స్యూ సైకోఎనలిస్ట్‌గా పనిచేస్తుంది.

టక్కర్‌ భార్య వయసు 89 ఏళ్లు.అలా వీరిద్దరూ తమ జీవితాంతం వైద్య సేవలను అందిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.

గేమ్ చేంజర్ సినిమా కోసం ఒక పెద్ద సాహసం చేస్తున్న దిల్ రాజు…