సింహం డ్రెస్ వేసుకుని నిజమైన సింహాల దగ్గరికి వెళ్లాడు.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!

సింహం డ్రెస్ వేసుకుని నిజమైన సింహాల దగ్గరికి వెళ్లాడు తర్వాతేం జరిగిందో మీరే చూడండి!

ఇప్పుడు ట్విట్టర్‌లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది, చూసిన వాళ్లంతా పగలబడి నవ్వుతున్నారు.

సింహం డ్రెస్ వేసుకుని నిజమైన సింహాల దగ్గరికి వెళ్లాడు తర్వాతేం జరిగిందో మీరే చూడండి!

ఇందులో ఒక మనిషి ఒళ్లంతా సింహంలా డ్రెస్(lion Dress) వేసుకుని, గుంపుగా ఉన్న నిజమైన సింహాల దగ్గరికి వెళ్లాడు.

సింహం డ్రెస్ వేసుకుని నిజమైన సింహాల దగ్గరికి వెళ్లాడు తర్వాతేం జరిగిందో మీరే చూడండి!

అసలేం జరుగుతుందో అని సింహాలన్నీ ఆశ్చర్యంగా చూస్తుండగా, సెల్ఫీ స్టిక్(Selfie Stick) పట్టుకుని ఆ మనిషి వాటి మధ్యలో గంభీరంగా నడుచుకుంటూ వెళ్లాడు.

"""/" / మొదట్లో సింహాలు కూడా క్యూరియస్‌గా, "ఇదేంటి మనలాగే ఉంది కానీ వింతగా ఉందే" అన్నట్టుగా చూశాయి.

ఏంటో తెలుసుకునేందుకు ఒక సింహం మెల్లిగా ఆ డ్రెస్ వేసుకున్న మనిషి వైపుకు పాక్కుంటూ వచ్చింది.

ఇది స్నేహితుడా లేక తిందామా అని ఆలోచిస్తున్నట్టు ఉంది.ఆ తర్వాత సీన్‌లో ఆ మనిషి సింహాల గుంపులో ఒకడిలా గడ్డి మీద పడుకుని హాయిగా సెల్ఫీలు(selfies) దిగుతున్నాడు.

అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సింహాలన్నీ ఒక్కసారిగా అతన్ని వెంటాడటం మొదలుపెట్టాయి.

అప్పుడు అర్థమైంది ఆ మనిషికి అసలు విషయం.ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టాడు.

ఫైనల్‌గా ప్రాణభయంతో చెట్టెక్కేశాడు.ఫేక్ సింహం అయినా పారిపోవాల్సిందే అని ప్రూవ్ చేశాడు.

"""/" / ఇంకో షాకింగ్ ఏంటంటే, ఇంతటితో ఆగకుండా ఇద్దరు మనుషులు జీబ్రా డ్రెస్సులు(Zebra Dresses) వేసుకుని అక్కడికి ఎంట్రీ ఇచ్చారు.

నిజమైన సింహాలు వాళ్లను చూసి టెంప్ట్ అయ్యాయి.ఒక సింహం వెంటనే ఆ జీబ్రా డ్రెస్ వేసుకున్న మనిషి మీద దూకి, దాని బొమ్మ తలను కొరికేసింది.

హైలైట్ ఏంటంటే, ఆ సింహం ఆ "బహుమతి"తో అక్కడి నుంచి ఉడాయించింది.జరిగేది అర్థం కాక జనాలు షాక్ అయిపోయారు.

ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ "ఈ సింహం రెండు కాళ్ల మీద ఎందుకు నడుస్తుందో అని అవి కన్ఫ్యూజ్ అయ్యాయి.

" అని పంచ్ పేల్చాడు.మరొకరు "ఈ వారం నేను చూసిన వాటిలో ఇదే ఫన్నీ వీడియో.

" అని అన్నారు.నిజంగానే, కొన్నిసార్లు రియాలిటీ కూడా సినిమాలను మించి ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

కొంతమంది మాత్రం మరీ ఇంత రిస్క్ చేస్తారా అనిపిస్తుంది.

ఏంటి భయ్యా.. మనుషుల ఆరోగ్యంతో గేమ్స్ ఆడుకుందామనుకున్నారా?