సొంత పార్టీ మంత్రుల‌ను శుద్ధ మొద్దులు అన్న సీఎం.. ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు

ఒక రాజకీయ పార్టీ అధినేత అంటే త‌మ పార్టీలో ప‌నిచేసే వారి గురించి నిత్యం గొప్ప‌గానే చెబుతుండాలి.

ఇక ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ పార్టీ త‌ర‌ఫున మంత్రులుగా ఉన్న వారి గురించి ముఖ్య‌మంత్రి ఇంకెంత గొప్ప‌గా చెప్పాలో అంద‌రికీ తెలిసిందే.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సీఎం కూడా ఇలా త‌మ మంత్రుల గురించి త‌ప్పుగా మాట్లాడ‌లేదు.

కానీ ఇప్ప‌డు మాత్రం ఓ సీఎం ఏకంగా త‌మ మంత్రుల గురించి దారుణమైన వ్యాఖ్య‌లు చేశారు.

ఇదే విష‌యాన్ని కేంద్రానికి కూడా లెట‌ర్ రూపంలో వివ‌రించ‌డం సంచ‌ల‌నంగా మారింది.మిజోరం సీఎం త‌న మంత్రుల‌కు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, శుద్ధ మొద్దులు అంటూ దారుణ‌మైన కామెంట్లు చేశారు.

అది కూడా లెట‌ర్ లో రాసి పంపించారు.అస‌లు విష‌యం ఏంటంటే రీసెంట్ గా ఆ రాష్ట్రానికి సీనియర్ ఆఫీస‌ర్ రేణు శర్మను సీఎస్ గా కేంద్రం నియ‌మించింది.

కాగా ఆయ‌న్ను వ‌ద్దంటూ మంత్రులు మొత్తం ప‌ట్టు ప‌ట్టారు.ఎందుకంటే రేణు శర్మ కు కేవ‌లం హిందీ, ఇంగ్లీష్ త‌ప్ప మిజోరాం భాష రాదు.

ఇక్క‌డి మంత్రుల‌కు ఏమో హిందీ, ఇంగ్లీష్ రాదు.దీంతో వారు అత‌నితో ఎలాంటి ప‌నులు చేయించుకోలేక‌పోతున్నామ‌ని వాపోయారు.

"""/"/ దీంతో మ‌జోరాం సీఎం ఆయ‌న్ను వ‌ద్దంటూ కేంద్రానికి లేఖ రాశారు.మీరు హిందీ, ఇంగ్లీష్ భాషలు మాత్ర‌మే వ‌చ్చిన వ్య‌క్తిని ఇచ్చార‌ని, అత‌నితో త‌మ మంత్రులు ప‌ని చేయ‌లేక‌పోతున్నార‌ని వారు శుద్ధ మొద్దులు అంటూ కేంద్రానికి ఓపెన్ లెట‌ర్ రాసేశారు.

నిజానికి మిజోరాం లో ఉన్న‌ది ఎన్డీయే ప్రభుత్వంలో భాగ‌స్వాములే.అయినా కూడా అత‌ను మాత్రం ఇలా మాట్లాడ‌టం పెను సంచ‌ల‌నం రేపుతోంది.

ప్ర‌భుత్వంలో ఉన్న మంత్ర‌లు ఎవ‌రూ కూడా పెద్ద‌గాem ఢిల్లీ లాంటి ప‌ట్ట‌ణాల‌కు వెళ్ల‌క‌పోవ‌డంతో వారికి భాష ప్రాబ్ల‌మ్ అవుతోంద‌ని తెలుస్తోంది.

ఇదేం పెళ్లి గోల రా బాబు.. భారతీయులపై కెనడా యువతి తిట్లు వింటే నవ్వాగదు!