క్యాచ్ పట్టి.. ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించాడు

కొంత మందికి ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి.వాటిని ప్రదర్శించడం ద్వారా వారి ప్రతిభను ఎంతో మంది మెచ్చుకుంటూ ఉంటారు.

అయితే కొన్ని ఆసక్తికరమైన, నైపుణ్యమున్న వాటికి గిన్నిస్ రికార్డు దక్కుతుంది.ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రికార్డ్ బ్రేకింగ్ వీడియోలు, విజయాలను తరచూ పోస్ట్ అవుతుంటాయి.

అవి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.కొన్ని నవ్విస్తాయి.

మరికొన్ని కవ్విస్తాయి.ఇంకొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి.

తాజాగా పోస్ట్ అయిన వీడియో కూడా ఎంతో మందిని ఆకర్షిస్తోంది.వందల అడుగుల ఎత్తు నుంచి విసిరిన ఫుట్ బాల్‌ను ఇద్దరు అవలీలగా క్యాచ్ పట్టేశారు.

దీనికి గిన్నిస్ రికార్డు కూడా దక్కింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇటీవల అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాబ్ గ్రోంకోవ్స్కీ, జెడ్ ఫిష్చే అరుదైన రికార్డు సాధించారు.

అత్యధిక ఎత్తు నుంచి వదిలిన ఫుట్ బాల్‌ను క్యాచ్ పట్టారు.ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను సంపాదించారు.

ఈ రికార్డును అమలు చేస్తున్న పురుషుల ఫుటేజీని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వారి వీడియో తాజా పోస్ట్ అయింది.

188.9 మీటర్లు (620 అడుగులు) ఎత్తు నుంచి వదిలిన ఫుట్‌బాల్‌ను రాబ్ గ్రోంకోవ్స్కీ, జెడ్ ఫిష్చే క్యాచ్ పట్టారు.

వీడియోలో మాజీ NFL ఆటగాడు, అతని కళాశాల ఫుట్‌బాల్ జట్టు కోచ్ కలిసి ఈ రికార్డు సాధించారు.

23 ఏప్రిల్ 2021న అరిజోనాలోని టస్కాన్‌లోని అరిజోనా విశ్వవిద్యాలయ ఫుట్‌బాల్ మైదానంలో అరిజోనా విశ్వవిద్యాలయం ఈ రికార్డును నమోదు చేశారు.

అప్పటి వీడియోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గిన్నిస్ రికార్డ్స్ సంస్థ పోస్ట్ చేసింది.

దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

క మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలు ఇవే.. ఇతర భాషల్లో కిరణ్ కు సక్సెస్ దక్కుతుందా?