రన్నింగ్ కారుపై పటాకులు పేల్చాడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

కొంతమంది చేసే వికృత చేష్టలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు.థ్రిల్ కోసం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ వివాదాస్పదం అవుతూ ఉంటారు.

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవ్వాలనే అత్సుత్సాహంతో ఏ పనైనా చేయడానికి వెనుకాడరు.

తాజాగా ఒక వ్యక్తి అలాటి పనే చేశాడు.కదులుతున్న కారు పైకప్పుపై టపాకులు పెట్టి కాల్చాడు.

హర్యానాలోని గురుగ్రామ్( Gurugram In Haryana ) లో ఈ షాకింగ్ ఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే. """/" / గురుగ్రామ్ లోని సైబర్ సిటీ ప్రాంతంలో గల గోల్్ కోర్స్ రోడ్డులో( Goal Course Road ) ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒక వ్యక్తి కారులో వెళ్తుండగా.అతడే డోర్ నుంచి బయటకు వచ్చి పైకప్పుపై టపాసులు పెట్టాడు.

ఆ తర్వాత వాటిని కాల్చాడు.రోడ్డుపై వెళుతున్న మిగతా వాహనదారులు ఇది చూసి షాక్ అయ్యారు.

కొంతమంది ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియోను చూస్తే కారుకు నంబర్ ప్లేట్ లేదు. """/" / ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.

నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఎవరూ ఇలా చేయవద్దని, చేస్తే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.కాగా ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా ఎక్కువవుతున్నాయి.

యువత సోషల్ మీడియాలో మోజులో పడి పోలీస్ కేసుల్లో చిక్కుకుంటున్నారు.ఇలా దొరికిపోయి కటకటాలపాలవుతునన్నారు.

బహిరంగంగానే రోడ్లపై మితిమీరి ప్రవర్తిస్తున్నారు.గతంలో దీపావళి సమయంలో ఒక యువకుడు కారులో టపాసులు పేల్చి కాల్చాడు.

అప్పట్లో ఆ వీడియోం కాంట్రవర్సిగా మారింది.