వివాహం జరిగిన మూడు రోజులకు ప్రెగ్నెంట్ అయిన వధువు.. సినిమాలను మించిన ట్విస్టు..
TeluguStop.com
చాలా వరకు పెండ్లి అయిన కొత్త జంటల్లో చిత్ర విచిత్రాలు జరగడం చాలా కామన్ అయిపోయింది.
ఇష్టం లేని పెండ్లి చేయడమే లేదంటే వేరే కారణాలతోనే వారి జీవితాల్లో మాత్రం చాలా దారుణాలు కూడా జరుగుతుంటాయి.
అయితే సాధారణంగా సమాజంలో ప్రేమ పేరుతో అబ్బాయిల మోసాలు పెరుగుతున్న సందర్భంలోనే ఈ మధ్య అమ్మాయిలు కూడా అదే స్థాయిలో దారుణాలకు పాల్పడుతున్నారు.
తమకు ఏం తక్కు అన్నట్టు ముగ్గురు నుంచి నలుగురిని పెండ్లి చేసుకుంటూ సంచలనం రేపుతున్నారు.
ఇంకా కొందరేమో అక్రమ సంబంధాల మోజులో పడిపోతున్నారు.అయితే ఇప్పుడు మాత్రం ఓ చిత్ర విచిత్రమైన ఘటన జరిగింది.
అదేంటంటే ఓ అమ్మాయి తన ప్రియుడితో ఎఫైర్ లో ఉండగానే మరో వ్యక్తితో తాళి కట్టించుకుని సంచలనం రేపుతోంది.
ఇంకేముంది ఆ పెండ్లి చేసుకున్న వ్యక్తికి చుక్కలు చూపించింది.అయితే ఇప్పటి వరకు ఆ కిలేడీ ఏకంగా మూడు వరకు పెళ్లిళ్లు చేసుకుని దారుణంగా మోసాలకు పాల్పుడుతోందంట.
కాగా ఆమె ఆకృత్యాలు తన రెండో భర్త ఇచ్చిన కంప్లయింట్లో వెలుగులోకి వచ్చింది.
ఈ కిలేడీపై ఇండియన్ ఆర్మీ ఉద్యోగి అయిన ప్రసాద్ తనకు జరిగిన మోసాన్ని బయటపెట్టారు.
"""/"/
విశాఖపట్నంలోని చినగంట్యాడలో నివాసం ఉంటున్న ఈ కిలేడీ పోయిన సంవత్సరం డిసెంబరులో ప్రసాద్ ను పెండ్లి చేసుకుందంట.
ఇక పెండ్లి సందర్భంగా చాలా వరకు డబ్బులు తీసుకుందంట.ఏకంగా రూ.
90 లక్షల దాకా వసూలు చేసుకున్న యువతి తిరిగి తన వద్దకు రాకపోవడంతో ప్రసాద్ ఎంక్వయిరీ చేయించగా ఆమెకు ఇది వరకే మరో ఇద్దరితో పెళ్లిళ్లు అయినట్టు సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
ఈమెకు మొదట ఓ వ్యక్తితో పెండ్లి కావడంతో అతనితో ఉండగానే ప్రియుడి కారణంగా ప్రెగ్నెంట్ అయింది.
దీంతో అతను వదిలేశాడు.ఇక ప్రియుడు, ఆమె కలిసి ఓ డబ్బున్న వ్యక్తిని పెండ్లి చేసుకుని డబ్బు లాగాలని భావించారు.
ఇందుకోసం ప్రసాద్‌ను పెండ్లి చేసుకుంది.ఆయన నుంచి అందినా కాడికి దోచుకున్నారు.
ఆ తర్వాత మూడో వ్యక్తిని పెండ్లి చేసుకుంది.ఇక ప్రసాద్ విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె బండారం బయట పడింది.
సూర్య కంగువా సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ కి పాన్ ఇండియా సక్సెస్ ను ఇస్తాడా..?