రూ.11 కోట్లు ఎక్కువిచ్చి ఇల్లు కొన్నాడు.. తీరా చూస్తే..

'ది కంజురింగ్ ఫ్రాంచైజీ' అనే సినిమా గురించి చాలామంది వినే ఉంటారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.

అయితే.ఈ సినిమాలో స్టోరీ.

రోడ్ ఐలాండ్ ఫామ్‌హౌస్‌లో నివసించే వ్యక్తులు అనుభవించిన పారానార్మల్ యాక్టివిటీ ఆధారంగా తెరకెక్కించారు.

ఈ హౌస్ 1736లో నిర్మించబడింది.అనంతరం 1971 నుండి 1980 వరకు, ఆండ్రియా పెరాన్ రోడ్ ఐలాండ్ ఇంట్లో నివసించేవారు.

ఇక ఇందులో జరిగిన కొన్ని సంఘటనల గురించి ది వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడుతూ.

తన కుటుంబం ఇంట్లో భయంకరమైన ఎన్‌కౌంటర్లు అనుభవించిందని.తన తల్లి కరోలిన్ పెర్రాన్ కుర్చీలో నుంచి 20 అడుగుల ఎత్తుకు విసిరివేయబడి, ఆపై తన తలను నేలపై కొట్టుకున్నట్లు చెప్పింది.

కానీ ఒక గంట తర్వాత తన తల్లికి ఆ సంఘటన గుర్తుకు లేదని ఆండ్రియా తెలిపింది.

దీంతో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్, లోరైన్ వారెన్ ఈ సంఘటనల గురించి తెలుసుకున్న అనంతరం కుటుంబానికి సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

"""/"/ అయితే ఈ ఫామ్ హౌస్‌ను పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు జెన్, కోరీ హెయిన్‌జెన్ 2019లో $4,39,000 కి కొనుగోలు చేశారు.

అనంతరం ఆ ఇంటిని ప్రస్తుతం WonderGroup LLC యజమాని జాక్వెలిన్ నునెజ్ $1.

525 మిలియన్ డాలర్లకు(11,65,38,300.00) అంటే యజమాని అడిగిన దానికంటే 27శాతం ఎక్కువ ధరకి కొనుగోలు చేశారు.

ఇక జాక్వెలిన్ ది బోస్టన్ గ్లోబ్‌తో మాట్లాడుతూ.' కొనుగోలు నాకు వ్యక్తిగతమైనది.

ఇది రియల్ ఎస్టేట్ అభివృద్ధి కాదు.నా స్వంత నమ్మకాలకు సంబంధించింది' అని అన్నారు.

ఇక ఈ ఇంట్లో జరిగిన సన్నివేశాలే 2013లో ది కంజురింగ్ చిత్రానికి స్ఫూర్తినివ్వగా.

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మరో రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి.

12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉపాసన రాంచరణ్ దంపతులు..ఉపాసన పోస్ట్ వైరల్!