మ్యాచ్ టికెట్ల అమ్మకం బాధ్యత హెచ్‎సీఏదే..!

హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.చాలా కాలం తర్వాత మ్యాచ్ తో టికెట్లకు బాగా డిమాండ్ పెరిగింది.

కానీ దానికి తగ్గట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం ఏర్పాట్లు చేయలేదని చెప్పారు.

తాము అడిగిన తర్వాత టికెట్ల విక్రయాలు ప్రారంభించిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసేవాళ్లం కదా అని అన్నారు.

తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తామంటే కేసీఆర్ ఊరుకోరని హెచ్చరించారు.హెచ్సీఏ రాజకీయాలు ప్రభుత్వంపై రుద్దితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, టికెట్ల అమ్మకం బాధ్యత హెచ్‎సీఏదేనని తెలిపారు.

హెచ్‎సీఏ పూర్తిగా విఫలం చెందిందన్న మంత్రి.తొక్కిసలాట ఘటనపై కమిటీ ఏర్పాటు చేసామని తెలిపారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.