కాళ్ల పిక్కల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఇలా ఫాలో అవ్వండి..!

ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులు రావడం, పిక్కలు పట్టేయడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

కాళ్ళు అంటే తెలుసు మరి ఈ పిక్కలు అంటే ఏంటి అనుకుంటున్నారా.మన మోకాలుకు దిగువ భాగంలో, కాళ్లకు వెనక వైపున దృఢంగా ఉన్న కండరాలనే పిక్కలు అని అంటారు.

ఈ కండరాలు ఒక్కోసారి బాగా పట్టేసి ఉండడం వలన తీవ్రమైన కాళ్ల నొప్పులు వస్తాయి.

ఆ నొప్పులనే పిక్కల నొప్పులు అంటాము.అయితే ఈ కాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు అనేవి స్త్రీ, పురుషులలో ఎవరికైనా రావచ్చు.

ఎక్కువగా ఈ పిక్కల నొప్పులు రాత్రి పూట వస్తాయి.ఎక్కువగా శ్రమించినా,ఎక్కవ సేపు నిలబడిన నడిచిన గాని, కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండడం వలన పిక్కల నొప్పులు వస్తాయి.

అలాగే కాళ్ళకి ప్రవహించే రక్తనాళాలలో అవరోధాలు ఉన్నాగాని, పిక్క కండరాలకు సరఫరా అయ్యే నరాల మీద వత్తిడి కలిగిన ఈ పిక్కల నొప్పులు వస్తాయి.

అసలు ఈ నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన శరీరంలో మెగ్నిషియం లెవెల్ తక్కువగా ఉండడం వలన ఈ తరహా పిక్కల నొప్పులు వస్తాయి.

ఈ పిక్క కండరాల నొప్పి తగ్గాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించండి.పిక్క కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే మంచు గడ్డలు అంటే ఐస్ క్యూబ్స్ ను ఒక గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న కండరాల దగ్గర అద్దుతూ ఉండాలి.

ఇలా చేయడం వలన నొప్పి తగ్గుతుంది.అలాగే రాత్రిళ్ళు నిద్రకు ఉపక్రమించే ముందు కాళ్ళ కింద దిండు పెట్టుకుని కాళ్ళను ఎత్తులో ఉంచి పడుకోవడం వలన కూడా పిక్కల నొప్పులు తగ్గుతాయి.

"""/"/ రాత్రి నిద్రపోయే ముందు కాళ్ళ క్రింద దిండ్లు పెట్టుకుని కాళ్ళు ఎత్తులో ఉంచుకోవాలి.

ఇంకా కండరాల మీద వత్తిడి పడే విధంగా అతిగా నడవటం గాని, అతిగా యోగా, వ్యాయామాలు చేయటం, బరువులు ఎత్తడం వంటి పనులకు కొంతకాలం దూరంగా ఉండాలి.

అలాగే మీ రోజువారి ఆహారంలో పాలకూర, పెరుగు, గుమ్మడికాయ విత్తనాలు, బాదం పప్పు, చేపలు, కూరగాయలు వంటి ఆహార పదార్ధాలను తింటూ ఉండాలి.

ఉసిరికాయతో చేసిన తొక్కు పచ్చడిని రోజూ తినడం వలన మెల్లగా నొప్పి తగ్గుతుంది.

అలాగే బూడిద గుమ్మడికాయ, సొరకాయ కూడా తింటే నొప్పులు తగ్గుతాయి.అయితే ఇలాంటి పిక్కల నొప్పులకు రక్తహీనత కూడా ఒక కారణంగా అని నిపుణులు అంటున్నారు.

కాబట్టి ఎవరికైతే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయో వారు తగు జాగ్రతలు తీసుకోవడం మంచిది.

చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు, విశేషాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?