సమస్యలతో సతమతమవుతున్నారా... గుప్పెడు నల్ల నువ్వులతో సమస్యలకు చెక్ పెట్టండి!
TeluguStop.com
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం.కానీ కొందరికి మాత్రం సమస్యలు నిత్యం వెంటాడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి.
ఈ విధంగా నిత్యం సమస్యల వలలో చిక్కి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.
ఈ క్రమంలోనే సమస్యలతో బాధపడేవారు జ్యోతిష్య నిపుణులను సంప్రదించి వారి జాతకాలను కూడా తెలుసుకుంటారు.
ఈ విధంగా జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేని సమయంలో ఇలాంటి సమస్యలు వెంటాడుతాయనీ జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే గుప్పెడు నల్లనువ్వులతో ఈ విధమైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.
అధికమైన సమస్యలతో బాధపడేవారు శనివారం గుప్పెడు నల్లనువ్వులతో ఈ పరిహారాలు పాటించాలి.శనివారం రోజు గుప్పెడు నల్లనువ్వులను నీటిలో నానబెట్టాలి అదేవిధంగా నెయ్యితో దీపారాధన చేసిన అనంతరం నానబెట్టిన నల్ల నువ్వులను నీటితో సహా తీసుకువెళ్లి అశ్వత్థ వృక్షం కింద ఉంచడం వల్ల సమస్యలు తొలగిపోతాయి.
వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొనే వారు పాలను గంగాజలంలో కలిపి వాటిలో నల్లనువ్వులను నానబెట్టాలి.
ఇలా రాగి పాత్రలో నానబెట్టిన నల్లనువ్వులను తీసుకెళ్లి అశ్వత్థ వృక్షానికి సమర్పించాలి. """/"/
ఇక అనవసరమైన కారణాల వల్ల అధిక ధనం ఖర్చు అయితే ఆ ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవడానికి నల్లని వస్త్రంలో గుప్పెడు నల్లనువ్వులను ఇతరులకు దానం చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.
అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రాగి పాత్రలో పాలు గంగాజలంలో నల్ల నువ్వులను నానబెట్టి ఆ నీటిని శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.