అనంతపురం జిల్లాల్లో కుండపోత వర్షం..

అనంతపురం జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది.ఎడతెగని వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

వేలాది ఎకరాల్లోని పంటలు నీటిలో నానుతున్నాయి.ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది.

అనంతపురం జిల్లాలోని 15 మండలాల్లో వర్షం పడగా.అత్యధికంగా కుందుర్పిలో 60.

2 మి.మీ.

వర్షపాతం నమోదైంది.శ్రీసత్యసాయి జిల్లాలోని 21 మండలాల్లో వర్షం కురిసింది.

అత్యధికంగా గుడిబండలో 94.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలతో అనంతపురం రూరల్‌ మండలం రుద్రంపేట వద్ద మరువ వంక ఉధృతంగా ప్రవహించింది.

తాత్కాలికంగా నిర్మించిన మట్టి వంతెన తెగిపోవడంతో రుద్రంపేట-ఆలమూరు రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.విశ్వశాంతి నగర్‌, గౌరవ్‌ రెసిడెన్సీ కాలనీలు నీట మునిగాయి.

అనంతపురం రూరల్‌ మండలం కొడిమి వద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నగరంలోని రజక్‌ నగర్‌, ఇందిరానగర్‌ కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది.దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్19, శనివారం 2024