ఇది విన్నారా.. కుక్కపిల్లలకు బారసాల వేడుకలంట (వీడియో)

ఇప్పటి కాలంలో చాలామంది వారి ఇళ్లలో పెంపుడు జంతువులను ( Pets )పెంచుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

పెంపుడు జంతువుల లాగా కుక్కలు, పిల్లులు, పక్షులు లాంటివి పెంచుకుంటూ వారి ఆలనా పాలనా చూస్తూ ఉంటారు.

అంతే కాకుండా, వాటికి సంబంధించిన ఏ చిన్న వేడుకైనా కానీ.చాలా వైభవంగా వేడుకలు( Celebrate In Style ) నిర్వహిస్తూ ఉంటారు.

ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే, అచ్చం అలాంటి ఒకటి ఘటన జగిత్యాల ( Jagityala )జిల్లాలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. """/" / మరి ఆ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.

వారు ఎంతగానో ఆప్యాయంగా పెంచుకుంటున్న కుక్కకు నాలుగు పిల్లలు జన్మనివ్వడంతో ఆ కుక్క పిల్లలకు బారసాల కార్యక్రమం నిర్వహించారు.

ఈ క్రమంలో ఆ కుక్క పిల్లలకు కొత్త దుస్తులు తొడిగి ఉయ్యాలలో వేసి వేడుకలను నిర్వహించారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో సుభాష్ నగర్‌( Subhash Nagar In Metpally Town ) ప్రాంతనికి చెందిన ఒక జంట షీడ్జూ జాతికి( Shiedzu Breed ) చెందిన కుక్కను వారి ఇంట్లో పెంచుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆ కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ దంపతులు ఎంతో సంబరం పడిపోయి బారసాల కార్యక్రమం నిర్వహించారు.

"""/" / అంతే కాకుండా చుట్టుపక్కల వారిని, బంధువులను పిలిచి మరి ఈ వేడుకలను నిర్వహించారు.

ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

కొందరేమో మంచి పని చేశారని కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో, మితిమీరి ప్రవర్తిస్తున్నారని కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇది విన్నారా.. కుక్కపిల్లలకు బారసాల వేడుకలంట (వీడియో)