తస్సదియ్యా.. ఇది విన్నారా.. ఉబర్‌లో ఒంటె రైడ్ బుకింగ్
TeluguStop.com
మనం సాధారణంగా నగరాలలో లేదా పట్టణాలలో ఎక్కడికైనా పోవాలి అంటే సొంత వాహనంలో అయినా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ( Public Transport )లో ప్రయాణం చేస్తాము.
ఇక నగరాలలో అయితే.ఉబర్, రాపిడో ఇలా పలు సంస్థల ద్వారా రైడ్ ను బుక్ చేసుకుని వారి గమ్యానికి చేరుకుంటారు.
ఈ సంస్థలలో బైక్, క్యాబ్ ఇలా పలు వాహనాలను మనం బుక్ చేసుకోవచ్చు.
కానీ.తాజాగా ఒక యువతి ఉబర్ రైడ్ ద్వారా ఒంటె పై సవారిచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఎడారిలో చిక్కుపోయిన ఒక మహిళ ఉబర్ యాప్( Uber App ) ద్వారా ఒంటెను బుక్ చేసుకుని తన గమ్యానికి చేరుకుంది.
"""/" /
అయితే., వాస్తవానికి ఎడారిలో ఈ క్యాబ్ సర్వీస్ ఎలా అందించబడుతుందో చాలా మందికి అంతుచిక్కడం లేదు.
ఇందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.మహిళ తన ఫోన్ చూపిస్తుంది.
అందులో ఆమె ఉబర్ ద్వారా ఒంటె రైడ్ ను బుక్ చేసుకున్నట్లు మనం చూడవచ్చు.
ఆ మహిళ ఈ ఉబర్ రైడ్ కోసం దాదాపు 1100 చెల్లించింది.ఒంటెను బుక్ చేయగా కేవలం 20 సెకండ్లలోనే ఆ మహిళ ఉన్న ప్రదేశానికి ఒంటె చేరుకోవడం మనం చూడవచ్చు.
ఉబర్ ద్వారా బుక్ చేసిన వెంటనే తనను పికప్ చేసుకునేందుకు రావడంతో ఒక్కసారిగా ఆ మహిళ ఆశ్చర్యానికి లోనైంది.
ఈ క్రమంలో ఒంటెను తీసుకొని వచ్చిన వ్యక్తి సంతోషంగా పలకరించడం వీడియోలో గమనించవచ్చు.
"""/" /
వీడియోలో చూసినట్లుగా.మీ జీవనోపాధి కోసం మీరు ఏం చేస్తారు అని ఆమె అడుగుతే.
తాను ఒంటే ద్వారా ఉబెర్ రైడ్‌లను నడుపుతున్నట్టు ఆ వ్యక్తి తెలియజేస్తాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలగా స్పందిస్తున్నారు.
'ఏంటి ఈ ఉబర్ రైడ్ లో ఇలాంటి సౌకర్యాలు కూడా ఉంటున్నాయా' అని కొందరు కామెంట్ చేస్తుంటే.
మరికొందరు ఇది అంతా ఫేక్ అంటూ కొందరు కొట్టి పడేస్తున్నారు.
వచ్చే జన్మలో ప్రభాస్ లాంటి కొడుకు పుట్టాలి.. ప్రముఖ నటి క్రేజీ కామెంట్స్ వైరల్!