ఈ టెస్లా కారు గురించి విన్నారా.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఏకంగా..!

శిలాజ ఇంధనాల ద్వారా నడిచే వాహనాల వల్ల రోజురోజుకూ కాలుష్యం బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ పొల్యూషన్‌ను తగ్గించేందుకు గాను ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించడం మేలని నిపుణులు, పర్యావరణ వేత్తలు సూచిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ రూపొందిస్తున్నాయి.తాజాగా అమెరికాకు చెందిన కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ ఈ ఏడాది ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఇటీవల మూడు కార్లను బెంగళూరుకు పంపింది.కాగా టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కారు త్వరలో భారత మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది.

కాగా, ఈ టెస్లా ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.అవేంటంటే.

"""/"/ ఈ ఎలక్ట్రిక్ టెస్లా కార్లలో మోడల్స్ కూడా ఉండగా, మోడల్ 3 కారు ఆపరేట్ చేయడానికి కీ అవసరమే లేదు.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌తో కారును నియంత్రించొచ్చు.ఇక ఈ టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది.

ఈ కారు 6 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగం వరకు పుంజుకోవడం విశేషం.

ఇక టెస్లా టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 586 కిలోమీటర్ల వరకు నడవడం గమనార్హం.

కాగా, ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

టెస్లా మోడల్ 3 కారును అయితే మీ పాకెట్‌లో ఉండే ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు.

అయితే, ఈ మోడల్ 3 టెస్లా కారుకు ధర కూడా ఎక్కువగానే ఉండే చాన్స్ ఉంది.

సుమారుగా రూ.70 లక్షల వరకు ప్రైస్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ టెస్లా మోడల్ 3 కారు ఇప్పటికే దేశంలో ఆల్రెడీ ఉంది.ప్రముఖ బిజినెస్‌మ్యాన్ ముకేశ్ అంబానీ ఈ కారును కొనుగోలు చేసి యూజ్ చేస్తున్నాడు.

వేసవిలో మీ జుట్టు మరింత అధికంగా ఊడుతుందా.. వర్రీ వద్దు ఇలా చెక్ పెట్టండి!