క్రికెట్ లో డైమండ్ డక్ గురించి విన్నారా..టీ20ల్లో డైమండ్ డక్ గా వెనుదిరిగిన ఆటగాళ్ళు వీళ్లే..!

భారత్ లో క్రికెట్ కు ఉండే క్రేజ్ మరే క్రీడకు లేదు.కాబట్టి క్రికెట్ లో వైట్ బాల్, నో బాల్, ఎల్బీ, డీఆర్ఎస్, డకౌట్, గోల్డెన్ డకౌట్, కంకషన్ సబ్ స్టిట్యూట్ లాంటి పదాల అర్థాలు కేవలం క్రికెట్ అభిమానులకే కాదు భారత్ లో ఉండే చాలామందికి తెలుసు.

కానీ క్రికెట్ లో డైమండ్ డక్( Diamond Duck ) అనే పదానికి అర్థం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు.

విశాఖ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్( Ruthuraj Gaikwad ) డైమండ్ డకౌట్ గా వెను తిరిగాడు.

ఈ డైమండ్ డకౌట్ అంటే తెలియని వారు.దీని అర్థం ఏమిటి అని గూగుల్లో సెర్చ్ లు చేస్తున్నారు.

"""/" / సాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.డకౌట్ అంటే ఎన్ని బంతులు ఆడిన కూడా ఒక్క పరుగు కూడా చేయకుండా పెవీలియన్ చేరడమే.

అదే గోల్డెన్ డకౌట్ అంటే.ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరడం.

మరి డైమండ్ డక్ అవుట్ అంటే బ్యాటర్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరడం.

"""/" / తాజాగా జరిగిన టీ20 మ్యాచ్( T20 Match ) లో రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా డైమండ్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి యశస్వి జైస్వాల్ ( Yashaswi Jaiswal )షాట్ ఆడాడు.

రెండో పరుగుకు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ రన్ అవుట్ అయ్యాడు.అయితే రుతురాజ్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదు కాబట్టి డైమండ్ డకౌట్ గా పెవిలియన్ చేరాడు.

గతంలో టీ20ల్లో 2016లో జస్ప్రిత్ బుమ్రా డైమండ్ డకౌట్ గా పెవిలియన్ చేరిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు.

2017లో అమిత్ మిశ్రా డైమండ్ డక్ ఔట్ గా పెవిలియన్ చేరిన రెండవ భారతీయుడుగా నిలిచాడు.

తాజాగా రుతురాజ్ గైక్వాడ్ డైమండ్ డక్ అవుట్ గా పెవిలియన్ చేరిన మూడవ భారత ఆటగాడిగా నిలిచాడు.

అల్లరి నరేష్ అల్లు అర్జున్ ను ఫాలో అవుతున్నాడా..?