సరస్సు మధ్యలో తేలాడే థియేటర్ ను ఎప్పుడైనా చూశారా..?!

మనమందరం సినిమాకి వెళ్లాలంటే ఏమి చేస్తాం.? ఏదన్నా సినిమా హల్ కి వెళ్లి చూస్తాం కదా.

కానీ మీరు దర్జాగా బోటింగ్ చేస్తూ బోట్ లో కూర్చుని సరస్సు మధ్యలో పెద్ద ధియేటర్ లో ఎప్పుడన్నా సినిమా చూసారా.

? వింటుంటేనే భలే థ్రిల్లింగ్ ఉంది కదా.! మరి మీకు కూడా ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కాశ్మీర్ వెళ్లాల్సిందే.

కాశ్మిర్ లో గల అందాల దాల్ సరస్సు మధ్యలో ఇలా నీటిలో తేలియాడే థియేటర్ ను నిర్మించారు.

చల్లటి వాతావరణంలో జమ్మూ కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌ లోని దాల్‌ సరస్సుపై ఏర్పాటు చేసిన ఈ ఓపెన్‌ ఎయిర్‌ ఫ్లోటింగ్‌ థియేటర్‌ లో బిగ్ స్క్రీన్ పై సినిమా చూడడానికి పర్యాటకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.

శ్రీనగర్‌ స్మార్ట్‌ సిటీ, జమ్మూ కశ్మీర్ యూత్‌ మిషన్‌ తో కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది.

కాశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా దాల్ సరస్సులో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు.

ఈ థియేటర్‌ పర్యాటకులను బాగా విశేషంగా ఆకట్టుకుంటోంది.ఐకానిక్‌ వేడుకలను పురస్కరించుకుని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ మెహతా ఈ ఫ్లోటింగ్‌ థియేటర్‌ ను ప్రారంభించారు.

"""/"/ నీటిలో తేలియాడే ఈ థియేటర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా టూరిస్టులు, స్థానిక కళాకారుల కోసం ఒకప్పటి బాలివుడ్ హిట్ పెయిర్ అయిన షమ్మీకపూర్‌, షర్మిలా ఠాగూర్ నటించిన 'కశ్మీర్ కి కలి' అనే బాలీవుడ్ సినిమాను ఈ థియేటర్‌పై మొట్ట మొదటగా ప్రదర్శించారు.

ఎందుకు ఈ సినిమానే ఇక్కడ థియేటర్ లో ప్రదర్శించారంటే దానికి ఒక కారణం ఉంది.

అది ఏంటంటే.ఈ సినిమా ఎక్కువ భాగాన్ని కశ్మీర్‌లోనే చిత్రీకరించారు కాబట్టి.

కశ్మీర్ లోని దాల్ సరస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు.మీరు కూడా నీటిలో బోటింగ్ చేస్తూ చల్లటి వాతావరణంలో సినిమా చూడాలనుకుంటే ఛలో కాశ్మిర్.

వరుసగా నాలుగోసారి ఆ రికార్డును అందుకున్న బాలయ్య.. ఈ హీరో వేరే లెవెల్!