ప్రపంచంలో ఇంత‌ చిన్న పామును ఎప్పుడైనా చూశారా ?

పామును చూస్తేనే ప‌.ప‌.

పాము అంటూ ద‌డుచుకుంటారు.అలాంటి పామే ఎదురై బుస‌లు కొడితే ఇంకేమైనా ఉందా.

అర‌చేతిలో ప్రాణాలు పెట్టుకున్న‌ట్టే అవుతుంది.ఒళ్లంతా చ‌మ‌ట‌లు ప‌ట్టి పై ప్రాణాలు పైనే పోయిన‌ట్టు అవుతుంది.

అయితే ప్ర‌పంచంలో అనేక ర‌కాల పాములు ఉన్నాయి.నాగుపాము, కొండ చిలువ‌, ర‌క్త‌పింజ‌రి, క‌ట్ల పాము, న‌ల్ల‌తాచు ఇలా అనేక ర‌కాల విష స‌ర్పాల‌తోపాటు స‌రీసృపాలు ఉన్నాయి.

ఇవీ సాధార‌ణంగా అడ‌వీ ప్రాంతాల్లో, వ్యవ‌సాయ బావుల వ‌ద్ద అప్పుడ‌ప్పుడు క‌న‌బ‌డుతుంటాయి.ప‌ల్లెల్లో, గ్రామాల్లోనూ పొట్ట‌కూటి కోసం పాములు ఆడించే వారుంటారు.

ఆ స‌మ‌యంలోనూ మ‌నం పాములను చూస్తుంటాం.గుంపుగా జ‌న స‌మూహంలో ఉన్నా పాములను చూస్తే జ‌డుసుకోక‌మాన‌రు.

విష స‌ర్పాలు అంటే జ‌నాల్లో భ‌యం అనేది అలా నాటుకుపోయింది.పాముల్లో అతి పెద్ద‌వి, అతి చిన్న పాములు కూడా ఉంటాయి.

అన్ని ర‌కాల పాముల‌ను మ‌నం గుర్తుప‌ట్ట‌క పోయినా వాటికి సంబంధించిన వీడియోలు ఏదో ఒక సంద‌ర్భంలో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి.

ప్ర‌స్తుతం ఓ చిన్న‌పాముకు చెందిన వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.ఈ వీడియోలో పామును చూస్తే ప్ర‌పంచంలోనే ఇంత చిన్న పాము ఉంటుందా అనిపిస్తుంది.

ఎందుకంటారా ? అది మ‌న చేతివేల్ల క‌న్నా మ‌రీ చిన్న‌గా ఉంటుంది.న‌లుపు, తెలుపు రంగులో ఉండి బుస‌లు కొడుతోంది.

కాటు కూడా వేసేందుకు ప్ర‌య‌త్నించింది.చిన్న పాము ప‌డ‌గ‌విప్పి బుస‌లు కొడుతూ ఉంటుంటే చూసిన వారెవ‌రైనా జ‌డుసుకోవాల్సిందే.

ఏంటీ ఇది న‌మ్మ‌శ‌క్యంగా అనిపించ‌డం లేదా.అయితే మీరూ ఒక సారి ఈవీడియో చూడాల్సిందే.

 ఈ వీడియో చూసిన వారు చాలామంది ఆశ్చ‌ర్య పోతున్నారు.ఇంత చిన్న‌ పాము ఏంట్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.మీ కామెంట్ ఏంటో తెలియ‌జేయండి.

కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. ఈ నటిని గుర్తు పట్టారా?