ఆటో రాంప్రసాద్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోస్!
TeluguStop.com
బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా ఎంతోమంది టాలెంట్ ఉన్నవారు ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.
ఇలా మల్లెమాల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు.
ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో ఆటో రాంప్రసాద్ ఒకరు.సుడిగాలి సుదీర్ స్కిట్లు ఉన్నటువంటి ఆటో రాంప్రసాద్ కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
ఈ విధంగా ఆటో రాంప్రసాద్ కమెడియన్ గా స్క్రిప్ట్ రైటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఈయన వ్యక్తిగత విషయాల గురించి మాత్రం ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించరు.
అయితే తాజాగా ఆటో రాంప్రసాద్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆటో రాంప్రసాద్ తన కూతురు మూడవ పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసిన నేటిజన్ లు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
ఈ ఫోటోలలో ఆటో రాంప్రసాద్ తన భార్య కుమార్తె కొడుకుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.
తన కుమార్తె పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఆటో రాంప్రసాద్ తన ఫ్యామిలీ మొత్తం బ్లూ కలర్ అవుట్ ఫిట్ ధరించి ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.
ఇలా ఆటో రాంప్రసాద్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ ఫోటోలపై స్పందిస్తూ క్యూట్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక జబర్దస్త్ కార్యక్రమం నుంచి కొద్ది రోజులపాటు గెటప్ శ్రీను సుడిగాలి సుదీర్ దూరమైనప్పటికీ ఆటో రాంప్రసాద్ మాత్రమే ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నారు.
అయితే ప్రస్తుతం గెటప్ శ్రీను కూడా తిరిగి ఈ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ కార్యక్రమం ద్వారా పొందిన గుర్తింపుతో ఈయన సినిమాలు కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
వరుస పర్యటనతో పవన్ బిజీ బిజీ .. నేడు ఉత్తరాంధ్రకు