వైరల్: ఈ పానీపూరి ఫౌంటెన్‌ను ఎపుడైనా చూసారా? చూస్తే ఇక ఆగలేరు!
TeluguStop.com
బేసిగ్గా మనం పానీపూరి బండిని చూస్తేనే ఆగలేము.అలాంటిది పానీపూరి ఫౌంటెన్‌ను చూస్తే ఇక ఆగగలమా? కష్టమే కదూ.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇక్కడి వీడియోని చూస్తే మీకు అదే అనిపిస్తుంది.
సోషల్ మీడియా బాగా ప్రబలడంతో ఇలాంటి వీడియోలు వీనులవిందు చేస్తున్నాయి.దాంతో నెటిజన్లు ఈ వీడియోలను షేర్స్ చేస్తున్నారు.
మీరు ఇలాంటి పానీపూరిని ఎక్కడా చూడకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
మీరే చెబుతారు ఇది చాలా అద్భుతంగా ఉందని.ఈ దేశీ స్నాక్ అంటే ఇక్కడ ఎంతోమందికి ఇష్టం.
టిక్‌టాక్‌లో షేర్ అయిన ఒరిజినల్ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ పద్మాలక్ష్మి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా ఇప్పుడది వైరలవుతోంది.
ఇక్కడ వీడియోని గమనిస్తే.ఓ గ్లాస్ పౌంటెన్ నుంచి పానీ కిందకి జారడం మనం గమనించవచ్చు.
ఇక కిందన పూరీలు ఉండటాన్ని చూడవచ్చు.అలా జారిన పానీని జనం తమ పూరీల్లోకి నింపి లొట్టలేసుకుని తిండడం ఇక్కడ చూడవచ్చు.
పద్మా లక్ష్మి దానిని షేర్ చేస్తూ, "మీరు గోల్‌గప్ప లవర్ అయితే నాలాగా మీరు ఈ ఫౌంటెన్‌ను కోరుకుంటారు.
"""/"/ ఇది కేవలం కోరిక కాదు.ఇష్టం, అవసరం అని చెప్పవచ్చు" అని సదరు పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో ఆన్‌లైన్ షేర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం.
కాగా ఈ వీడియోకు ఫిదా అయిన యూజర్లు పానీపూరి ఫౌంటెన్‌ను మెచ్చుకుంటూ కామెంట్ సెక్షన్‌లో దుమ్ముదులిపే కామెంట్లు రాస్తున్నారు.
'ఐ లవ్ పానీపూరి' అని ఒకరంటే 'ఐ లవ్ పానీపూరి ఫౌంటైన్' అని ఒకరు, 'పానీపూరి వరదలో మునిగిపోదాం పదండి' అంటూ ఒక యూజర్ కామెంట్ చేసాడు.
రష్మిక అబార్షన్ చేయించుకుందా….బాంబ్ పేల్చిన నటుడు…ఆయనే కారణమా?