Neha Choudar : నిన్ను ద్వేషిస్తున్నాను.. పెళ్ళై ఏడాది కాకముందే భర్త గురించి అలాంటి పోస్ట్ చేసిన నేహా?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ నేహా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈమె బిగ్ బాస్ సీజన్ 6 కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కానీ ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.
ఇకపోతే నేహా చౌదరి( Neha Choudary ) జిమ్నాస్టిక్ కమ్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం సినీ రంగంలోనే కాకుండా క్రీడారంగంలో కూడా తనదైన ముద్రను వేసుకుంది నేహ చౌదరి.
మరి ముఖ్యంగా తన యాంకరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.
"""/" /
తిరుపతి( Tirupati )కి చెందిన నేహా చౌదరి నేహా రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో భాగంగా ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ ను సైతం సొంతం చేసుకుంది.
ఇటీవలే ఈమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇంజనీరింగ్ సమయంలో ఇష్టపడ్డ అనిల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.
అనంతరం ఆమె జర్మనీ వెళ్లిపోయింది.అనిల్( Anil ) అక్కడే ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో ఆమె అక్కడకు వెళ్లింది.
జర్మనీలో ఉంటూ తన భర్తతో కలిసి ఇన్ స్టా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
అయితే పెళ్లి అయ్యి ఆరు నెలలు అయ్యిందో లేదో అప్పడే భర్తను ద్వేషిస్తున్నానంటూ తాజాగా ఒక పోస్టును పెట్టింది నేహా.
కాగా నేహా తన పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది. """/" /
నేను నిన్ను ఎంతో ద్వేషిస్తున్నాను.
ఎందుకంటే.ఈ ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
అందుకే అనుకుంటా దీన్ని పెళ్లి అని పిలుస్తారు.నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్ను కారు నడపనివ్వకపోయినా, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్, కేక్స్ వంటివి నాకివ్వకుండా నువ్వొక్కడివే తినేసినా.
నేను చెప్పిన పని ఏదీ చేయకపోయినా ప్రేమిస్తూనే ఉంటాను.కానీ నువ్వు నాకు సారీ చెప్పి, మళ్లీ చేయనని చెప్పి, మాటిచ్చిన ఐదు నిమిషాలకే తప్పులు చేస్తావు.
అయినా కూడా నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను.ఎందుకంటే నువ్వు ప్రేమించే విధానానికి నేను పడిపోయాను.
నువ్వు ఎప్పటికీ నావాడివే అని ఇన్ స్టాలో తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది నేహా.
ఆ పోస్టుని చూసిన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.
గేమ్‌లో ఓడిపోవడంతో ఆగ్రహించిన యూఎస్ వ్యక్తి.. కోపంలో ఏం చేశాడో తెలిస్తే..?