హడావిడిగా డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రారంభం…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో సమస్యలు తాండవిస్తున్నా వాటిని పక్కన అధికారులు బుధవారం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో హడావుడిగా ప్రారంభించి, ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు.
2020 చివరి నాటికి కట్టుబడి పూర్తిచేసినా,2023 మార్చి 19న డ్రా తీశారు.కానీ, కనీస మౌలిక వసతులైన వాటర్ ట్యాంక్ సేఫ్టీక్ ట్యాంకులు, విద్యుత్ సౌకర్యం,డ్రైనేజీ తదితర నిర్మాణ పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నా,ఇళ్ళ కిటికీల అద్దాలు పగిలి ఉన్నా,రోడ్డు సౌకర్యం లేకున్నా హడావిడిగా ప్రారంభించి,పట్టాలు పంపిణీ చేసినా లబ్దిదారులు అందులోకి వెళ్ళడానికి మాత్రం మరో నెలరోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యుత్ పోల్స్,విద్యుత్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు మరో రూ.85 లక్షలు ఖర్చు అవుతాయని దానికి సంబంధించిన ప్రపోజల్ మంత్రి జగదీష్ రెడ్డికి ఇస్తామని అధికారులు తెలిపడం గమనార్హం.
ఇదిలా ఉంటే కోదాడ డబుల్ బెడ్ రూం ఇళ్ళ లబ్ధిదారుల ఎంపికలో చేపట్టిన లాటరీ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని అర్హులైన లబ్ధిదారులు అరోపిస్తుంటే, పట్టాలు పొందిన వారు సౌకర్యాలు ఎప్పటికీ పూర్తవుతాయో,ఎప్పుడు గృహ ప్రవేశాలు జరిగేనో అని వేచి చూస్తే పరిస్థితిలో ఉన్నారు.
అయితే డబుల్ బెడ్ రూం ఇళ్ళలో పెండింగ్ వర్క్స్ మొత్తం త్వరలోనే పూర్తి చేస్తామని, మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చిన తర్వాతనే లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకోవాలని,
ఒక నెల సమయంలో పూర్తి స్థాయిలో అప్పగిస్తామని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు.
ఇదే అదునుగా భావించిన మున్సిపల్ కౌన్సిలర్స్ కొందరు తామే ఇళ్లు ఇప్పించామని,దానికి ప్రత్యేక రేటు చెల్లించాలని లబ్ధిదారులను వేధిస్తున్న ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ మారింది.
కోదాడ డబుల్ బెడ్ రూం ఇళ్ళ వ్యవహారం ఒక రాజకీయ ప్రహసనంగా మారిందని పట్టణ ప్రజలు విమర్శలు చేస్తున్నారు.
హెయిర్ ఫాల్ తో ఇక నో వర్రీ.. ఈజీగా వదిలించుకోండిలా!