ఈ ఏడాది ఎక్కువ ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ ఏంటో తెలుసా?
TeluguStop.com

ఒకప్పుడు దేశంలో బాలీవుడ్ హవా నడిచేది.కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది.


రాను రాను సౌత్ ఇండియన్ సినిమాలు, ఇక్కడి హీరోలు.హిందీ సినిమాలు, హీరోలను డామినేట్ చేస్తున్నారు.


ఫిల్మ్ మేకింగ్ లో బాలీవుడ్ ను తలదన్నే ప్రతిభ కనబరుస్తున్నారు టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, కన్నడ సినిమా పరిశ్రమ దర్శకులు.
ప్రస్తుతం నార్త్ హీరోలతో పోల్చితే సౌత్ హీరోల గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ కొనసాగుతుంది.
ఇండియాలో ఈ ఏడాది ఎక్కువ ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ లో సౌత్ ఫిల్మ్ హీరోలే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.
తొలి పది స్థానాల్లో తెలుగు హీరోలు ఇద్దరున్నారు.మరో ఇద్దరు తమిళ హీరోలు కొనసాగుతున్న.
బాలీవుడ్ నుంచి ఒక్క హీరో కూడా లేకపోవడం ఆశ్చర్యకర విషయం.అటు అల్లూ అర్జున్ కు సంబంధించి ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తారు.
నానా రచ్చ చేస్తారు.కానీ ఈ లిస్టులో స్టైలిష్ స్టార్ పేరు లేకపోవడం విశేషం.
అంతేకాదు.అతడి సినిమా పేరు కూడా ఇందులో లేదు.
దీన్ని బట్టి ఆయన అభిమానుల హడావిడి మిగతా హీరోలతో పోల్చితే అంత పెద్దదేం కాదు అనే టాక్ వినిపిస్తుంది.
ఇంతకీ ఈ ఏడాది ఎక్కువ ట్వీట్ చేసిన టాప్ 10 హ్యాష్ ట్యాగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట.మరొకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా.