సైబర్ అటాక్ ఏమైనా జరిగిందా..?! ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన సోషల్ మీడియా..!

వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా వాడకం చాలా మందికి బాగా అలవాటు అయింది.

ముఖ్యంగా వాట్సాప్ పదినిమిషాలు రాకపోయినా ఏదో కోల్పోయినట్లు చాలామంది హైరానా పడుతుంటారు.తమకిష్టమైన వారితో మాట్లాడ లేకపోతున్నామని బాధ కూడా పడుతుంటారు.

దీనిబట్టి వాట్సాప్ మన జీవితంలో ఎంత ముఖ్యమైన భాగం అయిందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి వాట్సాప్ సేవలు ఒక్కసారిగా గంటల తరబడి స్తంభించిపోతే.ఇంకేమైనా ఉందా? యూజర్లు తల్లడిల్లడం ఖాయం.

సరిగ్గా నిన్న ఇదే జరిగింది.దాంతో చాలామంది తమకు మాత్రమే వాట్సాప్ రావట్లేదా? అసలు ఏమై ఉంటుంది? అని తెగ హైరానా పడ్డారు.

కొందరు ఉన్నఫలంగా ట్విట్టర్ లోకి వచ్చి తమతో పాటు ఇతరులకు కూడా వాట్సాప్ రావట్లేదని తెలుసుకుని షాక్ అయ్యారు.

సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వాట్సాప్ తో సహా ఫేస్‌బుక్‌, ఇన్ స్టాగ్రామ్ సేవలు ఒక్క సారిగా ఆగిపోయాయి.

కొందరు ఇతర సోషల్ మీడియాలోకి వెళ్లి ఫిర్యాదు చేయగా.మరికొందరు Downdetector!--com వెబ్ సైట్ ను ఆశ్రయించారు.

తమకు ఒక్కరికే వాట్సాప్ రావడం లేదా లేక అందరికీ వాట్సాప్ సేవలు నిలిచిపోయాయా అని 30 వేల మంది నిమిషాల వ్యవధిలోనే చెక్ చేశారు.

ఈ క్రమంలో క్షమించాలి.మా వైపు ఏదో తప్పిదం జరిగింది.

దాన్ని గుర్తించి ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.ఈ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తాం’’ అని ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

"""/"/ మరోవైపు దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందించారు.వాట్సాప్ తమకు కూడా రావడం లేదని సరదాగా ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు.

సామాన్యులు మాత్రంసైబర్ అటాక్ ఏమైనా జరిగిందా? గంటల తరబడి వాట్సాప్ సేవలు నిలిచిపోవడం ఏంటని కంగారు పడ్డారు.

ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఆగిపోయిన వాట్సాప్ సేవలు ఈరోజు అనగా మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.

దాంతో చాలామంది యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే15, బుధవారం 2024