ఆరోజు తరువాతే.. బీజేపీ మార్పు ?

ఏపీ రాజకీయాలు( AP Politics ) ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటున్నాయో ఊహించడం కష్టంగా మారింది.

నిన్న మొన్నటి వరకు దోస్త్ లనుకున్న పార్టీలే ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.

మరోవైపు బద్ద శత్రువులుగా భావించిన పార్టీలు ఇప్పుడు కొత్త స్నేహానికి నాంది పలుకుతున్నాయి.

అసలు విషయంలోకి వెళితే.వైసీపీ, బీజేపీ( YCP , BJP ) మద్య అంతర్గత సంబంధం ఉందనేది బహిరంగా రహస్యం.

సకాలంలో నిధులు విధుదల చేయడం, జగన్ సర్కార్ కు అన్నీ విధాలుగా అండగా నిలుస్తూ రావడం.

జగన్( Jagan ) పై రాష్ట్ర బీజేపీ నేతలు అడపా దడపా విమర్శలు గుప్పిస్తున్నప్పటికి జాతీయ నేతలు ఎలాంటి విమర్శలు చేయకపోవడం.

వంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. """/" / విభజన హామీల విషయంలోనూ, పోలవరం నిధుల విషయంలోనూ కేంద్రాన్ని పల్లెత్తి మాట అనేది కాదు వైసీపీ సర్కార్.

ఈ పరిణామాలను గమనిస్తే బీజేపీ- వైసీపీ మద్య అంతర్గత పొత్తు ఉందనేది ఇట్టే అర్థమౌతోంది.

కానీ ఏమైందో తెలియదు గాని ఒక్కసారిగా వైసీపీపై, సి‌ఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ నేతలు.

అటు వైసీపీ కూడా బీజేపీ అండ తమకు అక్కరలేదని చెబుతోంది.ఈ వ్యవహారాన్ని చూస్తే వైసీపీ - బీజేపీ మద్య క్లాష్ మొదలైందా అనే డౌట్ రాక మానదు.

దీనికి కారణ బీజేపీ జాతీయ నేతలు ఏపీలో రావడం కంటే ముందు టిడిపి అధినేత చంద్రబాబు బేటీ కావడమే.

జూన్ 3 తేదీన బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు( Chandrababu ) బేటీ అయ్యారు.

పిలుపు కూడా జాతీయ నేతలే ఇవ్వడం గమనార్హం. """/" / ఈ బేటీ ఆనందతరం సీన్ మారిపోయింది.

నిన్న మొన్నటి వరకు టిడిపిని బద్ద శత్రువుల భావించిన బీజేపీ ఇప్పుడు టిడిపి విషయంలో సైలెంట్ అయి వైసీపీ విషయంలో ఫైర్ అవుతోంది.

ఆ బేటీలో అసలేం జరిగిందనేది ఇటు టిడిపి గాని, అటు బీజేపీ గాని బయట పెట్టడంలేదు.

కానీ వైసీపీ చెబుతున్నా దాని ప్రకారం టిడిపి, బీజేపీ మద్య దోస్తీ కుదిరినట్లే తెలుస్తోంది.

అయితే ఎవరితో బేటీ అయిన అందుకు సంబంధించిన అంశాలను మీడియా ముందు ప్రస్తావించే చంద్రబాబు.

బీజేపీ అధిష్టానంతో అయిన బేటీలో ఏం జరిగిందనేది చెప్పడం లేదు.దీంతో అసలు బీజేపీ ఏపీలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది.

బీజేపీ చేసే రాజకీయ ఎత్తుగడలు ఏంటి అనేది బిలియన్ డాలర్ కొశ్చన్ లా మారాయి.

ఇంతకీ ఆ బేటీలో ఏం జరిగిందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

స్పెయిన్ సీక్రెట్ రివీల్డ్: 6,000-ఇయర్-ఓల్డ్ బ్రిడ్జ్ వెలుగులోకి..?