జనసేన టిడిపి పొత్తు ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించిందా?
TeluguStop.com
అధికారికంగా తెలుగుదేశం, జనసేన పొత్తు కన్ఫామ్ కాకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఒక అవగాహన తోనే పోటీ చేయాలని రెండు పార్టీలు ఫిక్స్ అయినట్టుగా అర్థమవుతుంది, ఇప్పుడు ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా రెండు పార్టీల పొత్తును మరింత ముందుకు తీసుకు వెళ్ళేలా చేస్తాయి .
కలిసి పోటీ చేస్తే వచ్చే ఫలితాలను ఇప్పుడు ఆ రెండు పార్టీలకు అర్థమయ్యేలా చేశాయి.
బిజేపి పట్ల విముఖంగా ఉన్న జనసేన పార్టీ ( Janasena )అభ్యర్థిని నిలపకుండా వైసీపీని ఓడించండి అన్న సింగల్ స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ గా ఉండిపోయింది.
మిత్రపక్షం బిజెపికి ఓటు వేయమని ఎక్కడ పిలుపు ఇవ్వకపోవడం గమనార్హం.అధినేత ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో స్వేచ్ఛ దొరికిన జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులు టిడిపి అభ్యర్థి వేపాడ చిరంజీవికి ఓటేశారు.
ఇక్కడ టిడిపి తెలివితేటలు కూడా మెచ్చుకోవాల్సిందే, అప్పటివరకు ఉన్నఅభ్యర్థిని కాదని కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని చివరి నిమిషంలో నిలబెట్టడం కూడా ఆ పార్టీకి .
కలిసి వచ్చింది.కాపు సామాజిక వర్గం అభ్యర్థి కాబట్టి కచ్చితంగా జనసేన కచ్చితంగా మద్దతు ఇస్తుందనే పార్టీ అంచనాలు నిజమయ్యాయి.
"""/" / ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే విజయం నల్లేరుపై నడకనే అంశం ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చినట్టు అయింది.
కేవలం మాటల్లో భాగస్వామి అని చెప్పడమే తప్ప చేతల్లో ఒక అంశానికి కూడా మద్దతు ఇవ్వని బిజెపికి( Bjp ) జనసేన జలక్ గట్టిగానే తగిలినట్టు అర్థమవుతుంది.
అనధికారికంగా వీరి పొత్తు విరిగిపోయినట్లే భావించవచ్చు.మరి సీట్ల విషయంలోనూ సామాజిక సమీకరణాల విషయంలోనూ ఒక అవగాహనకు వచ్చి తెలుగు దేశం జనసేన పొత్తు చర్చలు గనక విజయవంతం అయితే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే రెండు ప్రతిపక్ష పార్టీల కోరిక తీరటం పెద్ద కష్టం కాకపోవచ్చు ఇది వైసీపీ ప్రభుత్వానికి ఒక రకంగా వార్నింగ్ బెల్ లాంటిది.
"""/" /
తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయని ధీమాగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి( Ysrcp ) ప్రభుత్వం వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో శాంపుల్ చూపించినట్టుగా ఈ ఎన్నికల పలితాలను చెప్పుకోవచ్చు .
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి దిద్దుబాటు చర్యలు తీసుకొని ఎన్నికల పరంగా సరైన వ్యూహాలను అవలంబించకపోతే మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న వైసీపీ కల కలగానే మిగిలిపోవచ్చు
.
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. కొత్త ఆలోచనతో చేపలను ఎంత సులువుగా పట్టేస్తున్నారో