షర్మిల తనకు తానే మునిగిందా..?

వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల( YS Sharmila ) తన పార్టీని ఆమె గంగలో కలుపుతున్నారా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఆంధ్ర పాలిటిక్స్ కు దూరమై తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయంగా స్థిరపడాలని చూసిన షర్మిల.

ఆమె వేసిన కొన్ని తప్పటడుగుల వల్ల ఇప్పుడు పార్టీ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది.

మొదట పాదయాత్రలు పర్యటనలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు షర్మిల.

కానీ ఆ తరువాత ఆమె అనూహ్యంగా కాంగ్రెస్( Congress ) వైపు అడుగులు వేశారు.

అదికూడా ఎన్నికల ముందు తన పార్టీ కార్యకలాపాలను హోల్డ్ లో ఉంచి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారు.

"""/" / ఫలితంగా షర్మిలా పార్టీలోని కీలక నేతలంతా ఆ పరిణామాలను జీర్ణించుకోలేక పోయారు.

దాంతో ఒక్కొక్కొక్కరుగా పార్టీ నుంచి బయటకు రావడం మొదలు పెట్టారు.కాగా మొదట షర్మిల రాకను స్వాగతించిన హస్తం పార్టీ ఆ తర్వాత డోర్స్ క్లోజ్ చేసింది.

దాంతో బ్యాక్ టూ హోమ్ అన్నట్లు మళ్ళీ పార్టీపై దృష్టి సారించింది షర్మిల.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం బాగానే జరిగిపోయింది.పార్టీ తరుపున బరిలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి.

"""/" / ఈ నేపథ్యంలో ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తుందని, తన తల్లి విజయమ్మ( Y.

S.Vijayamma ), ఆమె భర్త అనిల్ కుమార్ లను కూడా ఎలక్షన్ బరిలో నిలుపుతున్నట్లు టాక్ వినిపించింది.

అయితే ఇప్పుడు ఆ విషయాలపై కూడా షర్మిల సందిగ్ధంలో పడ్డారట.ప్రస్తుతం ఆమె ఎలక్షన్ బరిలో ఉన్నారనే సంగతే చాలమంది మర్చిపోయారు.

ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికల బరిలో నిలిచిన గెలిచే పరిస్థితి లేదనేది గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకు తగ్గట్లుగానే ఎన్నికల నుంచి తప్పుకుతున్నట్లు ఆమె తాజాగా ప్రకటించారు.కేవలం కాంగ్రెస్ కు మద్దతుగా ఉండాలని షర్మిల భావిస్తున్నారట భావిస్తున్నారట.

మొత్తానికి ఆ స్థిర నిర్ణయాల కారణంగా తన పార్టీ తానే నాశనం చేసుకుందనే వాదన రాజకీయ వర్గల్లో జరుగుతోంది.

వరంగల్ లో కాంగ్రెస్ కృతజ్ఞత సభ .. ఆయన వస్తున్నారా ?