రమ్య కృష్ణ ఆ స్టార్ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిందా..? ఎవ్వరికీ తెలియని షాకింగ్ నిజం!
TeluguStop.com
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందం తో పాటుగా అద్భుతమైన నటన కనబర్చే అతి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో రమ్య కృష్ణ( Ramya Krishna ) కూడా ఒకరు.
ఈమె తన కెరీర్ లో చేసినన్ని పాత్రలు నిన్నటి తరం హీరోయిన్స్ లో బహుశా ఎవరూ కూడా చేసి ఉండరు.
హీరోలపక్కన చిందులేస్తూ అందాలను ఆరబోసే పాత్ర అయినా, నటన తో హీరో ని సైతం డామినేట్ చేసే శక్తివంతమైన పాత్ర అయినా, చాలా అలవోకగా చెయ్యగలిగే కెపాసిటీ ఉన్న హీరోయిన్ ఈమె.
కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాదు, విలన్ రోల్స్ లో కూడా తనకి తానే సాటి అని అనిపించుకుంది.
ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) నటించిన 'నరసింహ' చిత్రం లో ఆమె పోషించిన విలన్ పాత్ర ని అంత తేలికగా ఎవరు మాత్రం మర్చిపోగలరు.
లేడీ విలన్ గా ఏ హీరోయిన్ చెయ్యాలి అనుకున్నా ఆ పాత్రలోని రమ్య కృష్ణ నటనని రిఫరెన్స్ గా తీసుకుంటారు.
"""/" /
అలా విలనిజం చూపించడం లో మాత్రమే కాదు, అమ్మవారి పాత్రలు వేయాలంటే కూడా ఆమె వల్లే సాధ్యం అవుతుంది.
'అమ్మోరు' చిత్రం లో ఆమెని చూసిన ప్రతీ ఒక్కరూ సాక్ష్యాత్తు అమ్మవారి దిగి వచ్చి వెండితెర మీద కనిపించిందా అనే విధంగా ప్రేక్షకులకు అనుభూతి కలిగింది.
ఇలా ఒక నటిగా తనలోని ఇన్ని వైవిధ్యాలు చూపించిన రమ్య కృష్ణ బాహుబలి( Bahubali ) సిరీస్ లో శివగామి దేవి గా పవర్ ఫుల్ పాత్ర పోషించి పాన్ వరల్డ్ రేంజ్ లో మంచి గుర్తింపుని దక్కించుకుంది.
నటిగా ఆమె చేసిన సినిమాలు, సాధించిన అవార్డులు రివార్డు గురించి అందరికీ తెలిసిందే.
కానీ ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా కొంతమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పింది.
ఆమె భర్త కృష్ణ వంశీ( Krishna Vamsi ) దర్శకత్వం లో తెరకెక్కిన 'ఖడ్గం' అనే చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
అప్పట్లో ఈ చిత్రం వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా నిల్చింది. """/" /
ఈ చిత్రం లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో శ్రీకాంత్ ప్రేయసి సోనాలి బ్రిందే పాత్రకి డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు, రమ్య కృష్ణ గారే.
అప్పటి వరకు తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునే అలవాటు లేని రమ్య కృష్ణతో , ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పించాడు ఆమె భర్త 'కృష్ణ వంశీ'.
ఇలాంటి ప్రయోగాలు కృష్ణవంశీ చాలానే చేసాడు.ఆయన దర్శకత్వం లో వచ్చిన 'చందమామ' చిత్రం మీకు గుర్తు ఉండే ఉంటుంది.
ఈ సినిమా ద్వారానే హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందరి దృష్టిలో పడింది.ఈమె పాత్ర కి డబ్బింగ్ ఇచ్చింది మరెవరో కాదు, ప్రముఖ స్టార్ హీరోయిన్ ఛార్మి.
ఇక 'ఖడ్గం' సినిమాలో ఎప్పుడైతే రమ్య కృష్ణ డబ్బింగ్ చెప్పిందో, అప్పటి నుండి ఆమె తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తుంది.
అలాంటి మ్యూజిక్ కావాలంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రవిగారు వింటున్నారా?