ఈ ఎన్నికలు కాదా ..? ఆ ఎన్నికలపైనే పవన్ ఆశలు పెట్టుకున్నారా ?

జనసేన పార్టీ రాజకీయం ఎవరికి అర్థం కాకుండా ఉంది.2014 ఎన్నికల్లో టిడిపి బిజెపికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు.

కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా , ఆ రెండు పార్టీలకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి జనసేన,  టిడిపి, బిజెపి లకు దూరంగా ఉంది.

బిఎస్పి , వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా,  కేవలం ఒకే ఒక్క స్థానాన్ని దక్కించుకుంది.

అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన ఓటమి చెందారు.

అయినా నిరాశ పడకుండా పవన్ పొలిటికల్ గా మైలేజ్ పొందేందుకు పార్టీని  బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే బిజెపి తమతో పొత్తు పెట్టుకోవాల్సిందిగా పవన్ పై ఒత్తిడి తీసుకురావడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.

అయితే ఇది కొంతకాలమే సఖ్యతగా నడిచిన రెండు పార్టీలు విడివిడిగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ప్రస్తుతం జనసేన, బీజేపీ వ్యవహారం చూస్తే ఈ పొత్తు తొందర్లోనే రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే టిడిపి , బిజెపి వంటి పార్టీలతో కాకుండా , 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు.

  """/"/ పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్తే ఫలితాలు ఆశించిన స్థాయిలో రావనే విషయం పవన్ కు తెలిసినా,  2019 ఎన్నికలను టార్గెట్ చేసుకుని పవన్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

  2029 నాటికి టిడిపి మరింతగా బలహీనమవుతుందని,  అప్పుడు ఖచ్చితంగా జనసేన బలోపేతం కావడంతో పాటు, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే బలమైన నమ్మకంతో పవన్ ఉన్నారు.

అందుకే  పొత్తుల లేకుండా ఒంటరిగా వెళ్లేందుకు పవన్ ధైర్యం చేస్తున్నారనే  ప్రచారం జరుగుతోంది దీనికి తగ్గట్లుగానే పవన్ వ్యవహార శైలి ఆయన ప్రసంగాలు ఉంటున్నాయి.

 .

కెనడా నుంచి ఇండియాకి వెళ్లి అల్లుడిని సర్‌ప్రైజ్ చేసిన మేనమామ..