ఆ విషయంలో దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడా.. సుమ ఏజ్ పై నెటిజన్స్ కామెంట్స్?
TeluguStop.com
టాలీవుడ్ లో యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఏ యాంకర్ తెచ్చుకొని గుర్తింపును సుమ సంపాదించుకొని ప్రస్తుతం బెస్ట్ యాంకర్ గా బాగా దూసుకుపోతుంది.
పైగా స్టార్ నటినటులకు ఉన్నా క్రేజ్ సుమ సంపాదించుకుంది.ఇక ఈమెకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
పైగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకొని ఒక లెవెల్ లో దూసుకెళ్తుంది.
ఎన్నో ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు సంపాందించుకుంది.
వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.కేవలం ఎంటర్టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్లలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఇలా ప్రతి ఒక్క ఈవెంట్ లో సుమ హోస్టింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను బాగా సందడి చేస్తుంది.
ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో బాగా బిజీగా ఉంది.ఇక సుమ మాటలు వింటే మాత్రం ప్రేక్షకులతో పాటు సెలబ్రేటీలు కూడా కరగాల్సిందే.
తను వేసే పంచులు ఇతరులను నొప్పించకుండా ఉంటాయి.పైగా అందరిని ఎలా కనెక్ట్ చేసుకోవాలో సుమకు తెలుసు.
సుమ అంటేనే మంచి ఎంటర్టైన్మెంటర్.స్టార్ నటీనటుల నైనా సరే సుమ తన మాటలతో బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
"""/"/
ఇతర భాషలకు చెందిన సెలబ్రెటీలను కూడా సుమ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది.
ఇప్పటివరకు ఎటువంటి విమర్శలు ఎదురుకాకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.అటువంటి సుమకు భవిష్యత్ తరాల వారికి కూడా తన యాంకరింగ్ చూపించే సత్తా తన లో ఉంది అని చెప్పవచ్చు.
ఇక సుమ షో కి ఎవరైనా వస్తే చాలు తన పంచులతోనే కాకుండా తన ప్రశ్నలతో కూడా వారిని ఇరకాటంలో పెడుతోంది.
దాంతో సుమని తట్టుకొని వాళ్ళు సుమకు పెద్ద దండాలు పెడుతూ ఉంటారు. """/"/
ఇక సుమ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తన ఇన్ స్టా ఖాతాలో కూడా బాగా ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటుంది.
సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.
ఇదంతా పక్కన పెడితే సుమ లేట్ వయసులో కూడా చాలా అందంగా ఉంటుంది.
నిజానికి ఆమెకు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే కూడా ఎవరు నమ్మరు. ఇప్పటికీ కూడా ఒక యుంగ్ హీరోయిన్ల కనిపిస్తూ ఉంటుంది.
అయితే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది.ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.
అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక మరో నెటిజన్.
ఎలా అక్క అని ఆశ్చర్యపోతూ దేవుడు మీకు ఏజ్ అనేది రాయడం మర్చిపోయాడా అని కామెంట్ పెట్టగా ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.