YS Sharmila : షర్మిల పై నమ్మకం పెరిగిందా ? లేకపోతే ఇంత పోటీ ఎందుకు బాసు 

ys sharmila : షర్మిల పై నమ్మకం పెరిగిందా ? లేకపోతే ఇంత పోటీ ఎందుకు బాసు 

ఈ మధ్యకాలంలో ఏపీలో కాంగ్రెస్( AP Congress ) బలోపేతం అయినట్టుగానే కనిపిస్తోంది.

ys sharmila : షర్మిల పై నమ్మకం పెరిగిందా ? లేకపోతే ఇంత పోటీ ఎందుకు బాసు 

ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల( YS Sharmila ) బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ నమ్మకం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో బాగా కనిపిస్తోంది.

ys sharmila : షర్మిల పై నమ్మకం పెరిగిందా ? లేకపోతే ఇంత పోటీ ఎందుకు బాసు 

ఏపీ , తెలంగాణ విభజన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు  ఘోర  పరాజయం ఎదురవుతూనే వస్తుంది.

ప్రస్తుతం ఆ పార్టీలో చెప్పుకోదగిన నేతలు ఎవరూ లేరు .ఏ ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ ప్రభావం ఏపీలో ఏమాత్రం కనిపించడం లేదు.

దీంతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత కూడా ఉంటుందని అంత అంచనా వేశారు.

అయితే షర్మిల ఇటీవల కాలంలో దూకుడుగా ముందుకు వెళ్లడం,  వైసిపి ప్రభుత్వాన్ని,  బీజేపీని( BJP ) టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ ఉండడం,  నిత్యం జనాల్లోనే ఉంటూ,  కాంగ్రెస్ ను బలోపేతం చేసే విధంగా వ్యవహారాలు చేస్తుండడం వంటివన్నీ బాగా కలిసి వచ్చాయి.

"""/" /  గత కొద్దిరోజులుగా ఆమె రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.దీనికి భారీగానే జనాలు హాజరవుతూ ఉండడంతో కాంగ్రెస్ నాయకుల్లోను పార్టీ బలోపేతం అవుతుందనే నమ్మకం పెరుగుతుండడంతో ఇప్పటివరకు ఇళ్లకే పరిమితం అయిన నేతలంతా ఇప్పుడు రోడ్లమీద వస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఏపీలో టిడిపి,  వైసిపిలు( TDP, YCP ) మాత్రమే బలంగా ఉన్నాయి.

కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడినట్లుగానే కనిపిస్తోంది.

దీనికి షర్మిల సభలకు వస్తున్న జనాలను చూస్తే అర్థమవుతుంది . """/" / ఇక దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు దరఖాస్తులు ప్రక్రియను మొదలుపెట్టారు.

దీనికి బాగానే స్పందన లభించింది.175 అసెంబ్లీ నియోజకవర్గాల కు సంబంధించి 793 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 105 మంది దరఖాస్తులు చేసుకోవడం తో కాంగ్రెస్ లో ఉత్సాహం కనిపిస్తోంది.

షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించి మంచి పని చేశామనే అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో కనిపిస్తోంది.

ఆ హీరోయిన్ తో మరోసారి జత కడుతున్న శర్వానంద్.. బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందా?

ఆ హీరోయిన్ తో మరోసారి జత కడుతున్న శర్వానంద్.. బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందా?