వైసీపీ విషయంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకున్నారా ?
TeluguStop.com
ఇటీవల కాలంలో వైసీపీ( YCP ) నుంచి వలసలు పెరిగిపోయాయి.ఆ పార్టీని వీడుతున్న వారిలో జగన్( Jagan ) కు అత్యంత సన్నిహితులైన వారు ఎక్కువగా ఉండడం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు ( Mopidevi Venkataramana, Beda Mastan Rao )పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి, రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇంకా నియోజకవర్గాల వారీగా చాలామంది నేతలే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.అయితే ఈ చేరిక విషయంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి త్వరలోనే ఖాళీ కాబోతోందా అన్న పరిస్థితి కనిపిస్తోంది.
"""/" / దీనికి కారణం వైసిపి కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కావడం, ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చాలామంది నేతలు టిడిపి, జనసేన , బిజెపిలలో( TDP, Janasena , BJP ) చేరేందుకు సిద్ధం అవుతున్నారు.
వీరిలో ఎక్కువమంది టిడిపి వైపే మొగ్గు చూపిస్తుండడంతో కీలక నాయకులను ఇప్పటికే కొంతమందిని చేర్చుకున్నారు.
ఇంకా అనేకమంది టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్న నాయకుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోతాయని, ఇప్పటికే అనేక చోట్ల ఈ తరహా పరిస్థితి ఎదురైందని, దీని కారణంగా పార్టీకి రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవచ్చని ఆలోచనతో చంద్రబాబు చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట.
"""/" /
వైసీపీ నుంచి వచ్చి చేరుతున్న నాయకుల్లో కొంతమందిని మాత్రమే చేర్చుకోవాలని , ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఈ చేరుకలు ఉండేలా చూసుకుంటే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట.
అలాకాకుండా అందరిని చేర్చుకుంటూ వెళ్తే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతాయని నాయకులు మధ్య ఆధిపత్య పోరు పెరిగి చివరకు అది పార్టీకి నష్టం తీసుకొస్తుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట.
ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో ఎన్టీయార్ మార్కెట్ ను పెంచుతాడా..?