బీజేపీ.. టార్గెట్ ఏపీ ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయి ప్రభుత్వం కూడా ఏర్పడడంతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై పడింది.

పేయిలో మరో మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే ఏపీలోని ప్రధాన పార్టీలైనా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.

కాగా ఏపీలో ఈ మూడు పార్టీల మద్యనే ప్రధాన పోరు ఉన్నప్పటికి బీజేపీ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఏపీలో ఫోకస్ చేస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణలో ఘోర ఓటమి చవి చూసిన బీజేపీ.( BJP ) ఇప్పుడు ఏపీపైనే ఆశలు పెట్టుకున్నాట్లు తెలుస్తోంది.

"""/" / తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని భావించినప్పటికి ఆ స్థానం కాంగ్రెస్( Congress ) కైవసం చేసుకోవడంతో కమలం పార్టీకి నిరాశే మిగిలింది.

ఇప్పుడు ఏపీలో( Andhra Pradesh ) ఎలాగైనా సత్తా చాటి సౌత్ లో ఎంతో కొంత బలం పెంచుకోవాలని చూస్తోంది కమలం పార్టీ.

ఆల్రెడీ ఏపీలో జనసేనతో( Janasena ) పొత్తులో ఉంది.అయితే జనసేన మాత్రం అటు టీడీపీతోను( TDP ) ఇటు బీజేపీతోను రెండు పార్టీలతో స్నేహ సంబంధం కొనసాగిస్తోంది.

దీంతో కమలంపార్టీ దిక్కు తోచని స్థితిలో ఉంటోంది.జనసేన అండతో ఏపీలో బలపడాలని చూస్తున్నప్పటికి పవన్( Pawan Kalyan ) బీజేపీ కంటే టీడీపీకే అధిక ప్రదాన్యం ఇస్తున్నారు.

"""/" / పోనీ టీడీపీ మరియు జనసేన కూటమితో కలిసి నడుద్దామా అంటే అధిష్టానం నుంచి అనుమతి లేదు.

దీంతో ఏపీ బీజేపీ( AP BJP ) ఏం చేయబోతుందనే చర్చ ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ జనసేనతోనే పొత్తు కొనసాగితే ఎన్నికల వేళ ఆ పార్టీకి సీట్ల కేటాయింపు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరమే.

ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు అధినేతలే స్పష్టం చేశారు.

దాంతో ఇప్పుడు బీజేపీని ఒంటరి అయిందనేది విశ్లేషకులు చెబుతున్నామట.ఇక ఏపీ ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీ సత్తా చాటకపోతే సౌత్ లో బీజేపీ పూర్తిగా డీలా పడే అవకాశం ఉంది.

ఏపీ విషయంలో కమలనాథులు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగబోతున్నారు.పొత్తు విషయంలో ఏం ఆలోచించబోతున్నారు అనేది చ్గూడలి.

హిట్3 సినిమాతో నాని ఆ రికార్డును క్రియేట్ చేస్తారా.. ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?