టీడీపీ శ్రేణులకు ప్రభుత్వ పథకం ఏదైనా ఆగిందా..?: సజ్జల
TeluguStop.com

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నింటినీ పక్కగా అమలు చేసిన నేత వైఎస్ జగన్ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.


టీడీపీ సానుభూతిపరులకు కానీ, పార్టీ శ్రేణులకు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకం ఒక్కటైనా ఆగిందా అని సజ్జల ప్రశ్నించారు.


గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవన్న ఆయన వారు ధృవీకరిస్తేనే సంక్షేమ పథకాలు అందేవని తెలిపారు.
రాష్ట్రంలో రూ.2 లక్షల 60 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను 99 శాతం నెరవేర్చామని స్పష్టం చేశారు.అయితే కావాలనే కుట్రపూరితంగా సీఎం జగన్ పై, వైసీపీ పాలనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వైరల్ వీడియో: ఆ కుక్కను ముద్దు చేశాడని.. వాచ్‌మెన్‌పై అసూయతో దాడిచేసిన మరో కుక్క!