వైరల్: అత్తను దారుణంగా కొట్టింది.. అరెస్ట్ అయ్యింది!
TeluguStop.com

కాలంతో పాటు సమాజంలో మార్పుటు చోటుచేసుకోవడం సాధారణమే అయినప్పటికీ.మానవ బంధాలు మరింత బలహీన పడటం ఆందోళన కలిగిస్తోంది.


మరీ ముఖ్యంగా హింసా ధోరణి పెరుగుతుండటం కలవరపెడుతోంది.ఇప్పటివరకూ వృద్ధులను, చిన్నారులను హింసించిన ఘటనలకు వెలుగులోకి వచ్చి.


దానికి సంబంధించి వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే, ఇదివరకూ అత్తలు.
కొడళ్లను రాచిరంపాన పెడుతున్నారనే వార్తాలు చాలానే చదివి ఉంటారు.కానీ ఈ మధ్య వృద్ధులైన అత్తామామలపై కోడళ్లు దాడిచేయడం వంటివి వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా హార్యానాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.వృద్ధురాలైన ఓ అత్తను.
కోడలు తీవ్రంగా హింసించింది.తీవ్రంగా ఆమెపై దాడి చేయడంతో పాటు.
ఇంటి నుంచి బయటకు గెంటేసింది.ఈ దారుణ ఘటన హర్యానాలోని హిస్సార్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.హిస్సార్‌లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం.
ఆ ఇంట్లో ఉండే వృద్ధ మహిళ (అత్త)ను ఆమె కోడలు.కొన్ని రోజులుగా తీవ్ర చిత్రహింసలు పెడుతోంది.
ఇప్పటికే పలుమార్లు ఆమెను తీవ్రంగా గాయపరిచింది.తాజాగా.
ఆమెను అనరాని మాటలు అంటూ.దుర్భాషలాడటంతో పాటు తీవ్రంగా కొట్టింది.
ఇంతటితో ఆగకుండా ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటివేసింది.బట్టు సైతం రోడ్డుపై విసిరింది.
ఇంట్లోకి వస్తే నీ సంగతి చూస్తా అంటూ బెదిరించింది.ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లిపో అంటూ హెచ్చరించింది.
ఈ దారుణాన్ని చూసిన స్థానికులు.అక్కడ జరిగిన దృశ్యాలనున వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అలాగే, పోలీసులకు సమాచారం అందించారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.
సదరు అత్తను హింసించిన కోడల్ని అదుపులోకి తీసుకున్నారు.కాగా, వృద్ధురాలిని హింసించిన కోడలిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరడంతో పాటు.
ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ ఘటన పై కేసు నమోదుచేసుకున్నామనీ, దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
హెచ్-1బీ కష్టాలు.. అమెరికాను వదలని భారతీయులు.. కారణం తెలిస్తే షాక్..?