పాలతో వరల్డ్ రికార్డు.. రోజుకు ఏకంగా 32 లీటర్లు

ఒకప్పుడు గేదె, ఆవు పాలు తాగేందుకు జనం ఉదయాన్నే లేచి వాటికోసం వెళ్లేవారు.

ఇప్పుడు అంతా ప్యాకెట్ పాల పుణ్యమా అని గేదె పాల గురించి పట్టించుకునే వారు లేరు.

గ్రామాల్లో, కొన్ని పట్టణాలలో తప్పితే గేదెలు కనిపించడం కూడా తక్కువయ్యాయి.కానీ పంజాబ్ రాష్ట్రంలోని ఓ గేదె మాత్రం ప్రపంచ రికార్డు సృష్టించి అందరి చూపు తనవైపు తిప్పుకుంది.

ఇంతకీ ఆ గేదె ఏం చేసిందా అని అనుకుంటున్నారా? హర్యానాలోని హిసార్ జిల్లాలో ముర్రా జాతికి చెందిన సరస్వతి అనే గేదె ఏకంగా 32 లీటర్ల పాలు ఇచ్చి ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది.

పంజాబ్‌లోని లుథియానాలో ప్రోగ్రెసివ్ డైరీ ఫార్మర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఇంటర్నేషనల్ డైరీ అండ్ అగ్రి ఎక్స్‌పో పోటీలో సరస్వతి ఈ రికార్డును క్రియేట్ చేసింది.

వరుసగా మూడు రోజులు 32 లీటర్ల పాలు ఇచ్చి సరస్వతి అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

సరస్వతి ఈ ఫీట్ సాధించి వరల్డ్ రికార్డు సృష్టించిందని నిర్వాహకుడు దల్జీత్ సింగ్ సదార్పురా తెలిపాడు.

సరస్వతి కేవలం పాలతోనే కాకుండా బలమైన అండాలతోనూ తన ప్రత్యేకత చాటుకుంటోంది.దీని అండాలతో కృత్రిమ పద్ధతుల్లో దూడలను ఉత్పత్తి చేస్తున్నారు.

కాగా సరస్వతిని అమ్మాలని భారీ మొత్తంలో ఆఫర్ వచ్చినా దాని యజమాని సుఖ్‌బీర్ ధండా ఒప్పుకోవడం లేదని, సరస్వతికి పుట్టిన దూడను రూ.

4.5 లక్షలు అమ్మినట్లు తెలిపాడు.

కూటమి గెలిస్తే ఇంట్లో ఒక్కరికే పథకమా.. బాబు షాకింగ్ షరతులు అలా ఉండబోతున్నాయా?