”మత్తు” కోసం కత్తిని మింగాడు.. చివరికి?

కరోనా వైరస్ ని నియంత్రించేందుకు మర్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే.

దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ ని అమలు చేశారు.దీంతో ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి.

ఇంకా మందుబాబుల పరిస్థితి అయితే మరి దారుణం.మద్యం కోసం కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే మరి కొందరు వారికీ వారే హాని చేసుకున్నారు.

మందుబాబుల పరిస్థితే అలా ఉంటే నిత్యం డ్రగ్స్ తీసుకునే వారి పరిస్థితి మారేలా ఉంటుంది.

మందుబాబులకు అయినా ప్రభుత్వం కాస్త సపోర్ట్ ఇచ్చి మద్యం షాపులు తెరిచింది.డ్రగ్స్ తీసుకునే వారికీ మాత్రం ఎవరి సపోర్ట్ లేకపోయే.

దీంతో డ్రగ్స్ తీసుకునే వారి పరిస్థితి దారుణంగా తయారయ్యింది.లాక్ డౌన్ సమయం నుండి డ్రగ్స్ సరఫరా నిలిచిపోయింది.

దీనికి ఫలితంగా ఓ వ్యక్తి చేసిన ఓ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎం చేశాడు అంటే హర్యానాలో డ్రగ్స్‌కు బానిసైన ఓ 28 ఏళ్ల ఇటీవల తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు.

డాక్టర్లు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కాలేయానికి కత్తి గుచ్చుకుని ఉండటం చూసి షాక్ కి గురయ్యారు.

"""/"/ మూడు గంటలు శ్రమించి ఎట్టకేలకు కత్తిని బయటకు తీశారు.20 సెంటీ మీటర్లు పొడవున్న అంత కత్తి శరీరంలోకి ఎలా చేరిందని అరా తియ్యగా అతనే డ్రగ్స్ లేక నరాలు జీవ్వుని లాగేస్తుండటంతో తట్టుకోలేక కత్తిని మింగినట్టు చెప్పాడు.

ఇంకా అది కాస్త నేరుగా కడుపులోకి జారుకుని కాలేయానికి గుచ్చుకుంది.దాదాపు నెలరోజులు అతడు ఆస్పత్రికి వెళ్లకుండా కత్తిని శరీరంలో ఉంచుకునే తిరుగుతున్నట్టు చెప్పాడు.

ఇంకా ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రిలో చేరాడు.ఇంకా ఆ కత్తిని బయటకు తీసిన వైద్యులు అంత పెద్ద కత్తిని మింగినా అతడు ప్రాణాలతో బతికడం వైద్య శాస్త్రంలోనే మిరాకిల్ అని అన్నారు.

ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్