6 నెలలు, 11 దేశాలు దాటి దొడ్డిదారిన అమెరికాలోకి.. భారతీయుడి కథ ఏమైందంటే?

అమెరికాలో( America ) ఉంటున్న అక్రమ వలసదారులను డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో పలువురు భారతీయులు కూడా ఉన్నారు.ఇప్పటికే పలు విడతల్లో వందలాది మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం మిలటరీ విమానాల్లో భారత్‌కు తరలించింది.

అలా బహిష్కరణకు గురైన వ్యక్తుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ.తాజాగా హర్యానాకు( Haryana ) చెందిన ఓ వ్యక్తి తనను మోసం చేసిన ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హర్యానాలోని పానిపట్‌కు చెందిన పంకజ్ రావత్( Pankaj Rawat ) అనే వ్యక్తి ఇటీవల ఇద్దరు మానవ అక్రమ రవాణా ఏజెంట్లపై గుజరాత్ పోలీసులకు ఫోన్ చేసి చీటింగ్ కేసు పెట్టాడు.

పంకజ్ ఆ ఇద్దరు ఏజెంట్లకు రూ.35 లక్షలు చెల్లించి అమెరికాకు చేరుకోవడానికి డంకీ రూట్‌ను ఎంచుకున్నాడు.

ఆరు నెలల పాటు 11 దేశాలు దాటి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమెరికా చేరుకున్నప్పటికీ అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులకు దొరికిపోయాడు.

ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం బహిష్కరించిన వారిలో పంకజ్ కూడా ఉన్నాడు.

పంకజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని సూరత్ క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.

"""/" / పశ్చిమ దేశాలకు , ముఖ్యంగా అమెరికాకు చేరుకోవడానికి అక్రమ వలసదారులు( Illegal Migrations ) డంకీ రూట్ లేదా గాడిద మార్గాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఈ క్రమంలోనే పంకజ్‌ను కూడా డంకీ మార్గంలో అమెరికాకు పంపేందుకు ఏజెంట్లు ఏర్పాట్లు చేశారు.

అతను గతేడాది ఆగస్టులో ప్రారంభమై.ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో అడుగుపెట్టాడు.

అయితే బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది పంకజ్‌ను పట్టుకుని తిరిగి భారతదేశానికి పంపించడంతో అతని డాలర్ డ్రీమ్స్ చెదిరిపోయింది.

ఏజెంట్లు అయిన అబ్దుల్లా, ప్రదీప్‌లు అమెరికాలో పని , వసతి కల్పించే నెపంతో పంకజ్ నుంచి రూ.

35 లక్షలను తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. """/" / దక్షిణ అమెరికా, మధ్య అమెరికా , ఉత్తర అమెరికాలోని 11 దేశాలైన గయానా, బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, పనామా, కోస్టారికా, హోండురాస్, నికరాగ్వా, గ్వాటెమాల, మెక్సికో దేశాల గుండా పంకజ్‌ను ఏజెంట్లు తరలించారని అధికారులు తెలిపారు.

చివరికి టెకేట్ సరిహద్దు ద్వారా పంకజ్ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాల్సి వచ్చింది.అయితే అతన్ని అమెరికా పోలీసులు పట్టుకుని 15 రోజుల పాటు నిర్బంధంలో ఉంచి ఫిబ్రవరి 16న భారతదేశానికి తిరిగి పంపించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఏజెంట్లు, మానవ అక్రమ రవాణా ముఠాలు తనను వివిధ ప్రదేశాలలో ఉంచి, చీకటి , ప్రమాదకరమైన అడవుల గుండా తీసుకెళ్లి అతని మొబైల్ సిమ్ , పాస్‌పోర్ట్ తీసుకొని చంపేస్తామని బెదిరించారని పంకజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.