35 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
TeluguStop.com
నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేంద్రంలో శ్రీ శ్రీనివాస రైస్ మిల్‌లో పీడీఎస్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి తనిఖీ చేసి,అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
అదే రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్న మండల కేంద్రానికి చెందిన యాదయ్య అక్రమంగా నిల్వ చేసిన సుమారు 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం అందించి, యాదయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరశేఖర్ తెలిపారు.
అంతే కాకుండా మండలపరిధిలో అక్రమంగా ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసినా, తరలించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ రవి, వెంకటేశ్వర్లు,రమేష్ పాల్గొన్నారు.
యూఎస్ మెయిల్ బాక్సులపై కుక్క కాలి గుర్తులు ఎందుకుంటాయో తెలుసా..