బీటెక్ చదవకుండా గూగుల్ లో రూ.50 లక్షల ఉద్యోగం సాధించిన విద్యార్థి.. గ్రేట్ అంటూ?

గూగుల్( Google ) లో ఉద్యోగం సాధించడం సులువైన విషయం కాదు.బీటెక్ చదవకుండా సాధారణ డిగ్రీతో గూగుల్ లో ఉద్యోగం సాధించాలంటే ఎన్నో ఆవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి.

ఐఐటీ స్టూడెంట్ కాకపోయినా నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా పూణేకు చెందిన హర్షల్ జాయికర్ తన కలను నెరవేర్చుకున్నాడు.

బీటెక్ చదివిన ఎంతోమంది స్టూడెంట్స్ కు హర్షల్ జాయికర్ ఆదర్శంగా నిలిచాడు. """/" / బ్లాక్ చెయిన్ టెక్నాలజీ( Black Chain Technology )లో ఎమ్మెస్సీ పూర్తి చేసిన హర్షల్ ఎప్పటికప్పుడు కోడింగ్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ ఐటీ రంగం విషయంలో తన అభిరుచిని చాటుకున్నాడు.

నేను బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చదివానని ఆ సమయంలో టెక్నాలజీపై నాకు ఎక్కువగా ఆసక్తి ఉండేదని హర్షల్( Harshal Juikar ) వెల్లడించారు.

నా స్కిల్స్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ సక్సెస్ అయ్యానని హర్షల్ పేర్కొన్నారు.

సొంతంగా కోడింగ్ స్కిల్స్( Coding Skills ) ను నేర్చుకోవడం నాకు ప్లస్ అయిందని హర్షల్ వెల్లడించారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్ డేట్ కావడం వల్ల నా కెరీర్ కు మేలు జరిగిందని హర్షల్ వెల్లడించారు.

నాకు దక్కిన సక్సెస్ ను నేనే నమ్మలేకపోతున్నానని హర్షల్ అన్నారు.గూగుల్ ఇంటర్వ్యూ ఎంతో కఠినంగా ఉంటుందని హర్షల్ వెల్లడించడం గమనార్హం.

హర్షల్ జుయికర్ తన తన సక్సెస్ వెనుక ఉన్న అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

"""/" / హర్షల్ జుయికర్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

హర్షల్ జుయికర్ స్పూర్తితో రాబోయే రోజుల్లో నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్( Non Engineering Students ) గూగుల్ లో ఉద్యోగం సొంతం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉంది.

హర్షల్ జుయికర్ గూగుల్ లో ఉద్యోగంలో చేరిన తర్వాత మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

నోటి పూతతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ రెమెడీస్ మీకోసమే!