వారి అండతో దుబాయిలో దాక్కున్న హర్ష సాయి..?
TeluguStop.com
గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా స్టార్ గా పేరుపొందిన హర్ష సాయి( Harsha Sai ) గురించి పలు వార్తలు హాల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన విషయాలు బయటకు రావడంతో వార్తల్లో నిలిచిన హర్ష సాయి మరోసారి అమ్మాయిని డబ్బులు తీసుకొని లైంగికంగా వేధించాడున్న విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో.
ప్రస్తుతం అతడిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.దీంతో హర్ష సాయి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు.
అయితే., పోలీసులు పట్టుకొనేందుకు వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో హర్ష సాయి అక్కడ ఉన్నాడు.
ఇక్కడ ఉన్నాడు.అంటూ అనేక మంది వివిధ రకాలుగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
"""/" /
రెండు రోజుల క్రితం హర్ష సాయి ప్రపంచ యాత్ర అన్వేష్( Anvesh ) తోపాటు తిరుగుతున్నాడు అంటూ కొందరు వారి వాదనలు వినిపించగా.
మరి కొందరేమో దుబాయ్ లో( Dubai ) ఉన్నాడంటూ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో హర్ష సాయి దుబాయ్ లో నిజంగానే ఉన్నాడా లేకపోతే అందులో నిజం ఎంత.
? ఒకవేళ ఉంటే దుబాయ్ లో ఎక్కడున్నాడు.? అనే విషయాలపై పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ప్రేమ పేరుతో మోసం చేసి మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని తనని పెళ్లి చేసుకోమంటే.
తనకు తెలియకుండా తీసిన న్యూడ్ వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్( Blackmail ) చేస్తున్నాడు అంటూ మహిళ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
"""/" /
ఇందుకు సంబంధించి హర్ష సాయిపై 376, 328, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో హర్ష సాయిని పోలీసులు అరెస్టు చేస్తాడన్న భయంతో అతడు దేశాన్ని వదిలిపెట్టి దుబాయిలో ఉన్నాడనే సంచలన విషయాలు ప్రస్తుతం వెలుగులో ఉన్నాయి.
దీంతో ఇప్పట్లో హర్ష సాయిని అరెస్టు చేయడం అంత సులువు కాదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను( Betting Apps ) ప్రమోట్ చేయడం ద్వారా ఎంతో మంది అమాయకులను బెట్టింగ్స్ వైపు పయనింపజేసి వారి ఆత్మహత్యలకు కారకుడు అయ్యారు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్.
అయితే దేశం నుండి వెళ్లిపోయిన తర్వాత దుబాయిలో ఉండటానికి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయించినవారే అతడికి ఆశ్రమం కల్పిస్తున్నారాన్న విషయం సంబంధించి కొందరు వారి వాదనలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
చూడాలి మరి చివరికి హర్ష సాయి పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో.ఎప్పుడు అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారో.
ఆ సినిమా వల్లే తట్టుకున్న దిల్ రాజు.. లేకపోతే అంతే సంగతులు..!