సెంచరీతో అదరగొట్టిన హ్యారీ బ్రూక్.. గ్యాలరీలో సందడి చేసిన గర్ల్ ఫ్రెండ్..!

తాజాగా కోల్ కత్తా - హైదరాబాద్( KKR Vs SRH ) మధ్య జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిన హ్యారీ బ్రూక్( Harry Brook ) సెంచరీ తో అదరగొట్టాడు.

ఇతనిపై ఉన్న నమ్మకంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.13 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఆ డబ్బుకు ఎట్టకేలకు న్యాయం చేసే ఇన్నింగ్స్ ఆడాడు.హైదరాబాద్ తరపున తోలి మ్యాచ్ లలో తక్కువ పరుగులు చేసి వెనుతిరగడంతో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు.

తనపై వస్తున్న విమర్శలకు ఫైనల్ గా చెక్ పెట్టి ఈ సీజన్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.

55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్స్ లతో చెలరేగి 100 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్ తో కలిపి భారీ స్కోరు నమోదు చేసింది.

తరువాత లక్ష్య చేదనకు దిగిన కోల్ కత్తా ఆటగాళ్లను కట్టడి చేసి 23 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.

"""/" / శతకంతో అదరగొట్టిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు.

అయితే మ్యాచ్లో హ్యారీ బ్రూక్ గర్ల్ ఫ్రెండ్ లూసీ( Lucy Lyles ) సందడి చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది.

బ్రూక్ బౌండరీలు కొట్టినప్పుడల్లా చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది.ప్రస్తుతం లూసీ సందడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చేరి వైరల్ అవుతున్నాయి.

"""/" / హైదరాబాద్ జట్టు విజయం సాధించిన తరువాత హ్యారీ బ్రూక్ స్పందిస్తూ ఈ మ్యాచ్ బాగా ఆడాలి అని అనుకున్నాను కానీ సెంచరీ సాధిస్తానని అనుకోలేదు అని తెలిపాడు.

ఈ ఐపీఎల్ లో తన మ్యాచులు చూడడానికి కుటుంబమంతా ఇండియాకు వచ్చిందని.కొన్ని కారణాలవల్ల తిరిగి కుటుంబ సభ్యులంతా స్వదేశానికి వెళ్లిపోయారని తెలిపాడు.

నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే ఉండి తన సెంచరీ ఇన్నింగ్స్ చూస్తూ ఎంజాయ్ చేయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని, నా కుటుంబ సభ్యులు కూడా ప్రత్యక్షంగా సెంచరీ ఇన్నింగ్స్ చూసి ఉంటే మరింత సంతోషంగా ఉండేదని బ్రూక్ తెలిపాడు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లను కచ్చితంగా తినాల్సిందే!